ఏపీ మంత్రులు.. ముందుంది పండ‌గ‌!

Last Updated on by

ముగ్గురు ఏపీ మంత్రులు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం 4వ బ్లాక్‌లోని కార్యాలయంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ బాధ్యతలు స్వీకరించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఎనిమిది జిల్లాల్లో స్టడీ సెంటర్స్‌ ఏర్పాటు చేసే దస్త్రంపై తొలిసంతకం చేశారు.

మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ.. మెరుగైన విద్య అందించే లక్ష్యంతో పనిచేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో 10శాతం కూడా ఖర్చు చేయలేదన్నారు. గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తన ఛాంబర్‌లో అడుగుపెట్టారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ శాఖమంత్రిగా నియమితులైన పిల్లి సుభాష్ చంద్రబోస్‌ కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే కొత్త జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ చేపడతామన్నారు. భూ సేకరణలో మార్కెట్‌ రేటు ప్రకారం ధరలు చెల్లిస్తామన్నారు. త్వరలో రాష్ట్రంలో భూముల రీసర్వే చేపడతామని వెల్లడించారు.

User Comments