ఏపీలో కులాల మ‌ధ్య‌నే అధికారం! నాగ‌బాబు

Last Updated on by

ఎన్నిక‌ల వేళ మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు టీడీపీ, వైసీపీపై దూకుడు పెంచారు. ప్ర‌శ్నిస్తున్న జ‌న‌సైనికుల‌పై టీడీపీ ప్ర‌భుత్వం అక్ర‌మ కేసులు బ‌నాయిస్తోంద‌ని ఫైర‌య్యారు. గుంటూరులో సోమ‌వారం మెగా అభిమానుల‌తో స‌మావేశం అయిన ఆయ‌న తేదేపాపై నిప్పులు చెరిగారు. త‌మ కార్య‌క‌ర్త‌ల్ని మాన‌స‌కంగా ఎంత వేధిస్తే అంత రాటుదేల‌తామ‌ని, టీడీపీ బెధిరింపుల‌కు, అక్ర‌మ కేసుల‌కు భ‌య‌ప‌డ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా అదిరేది .. బెదిరేది లేద‌న్నారు. జ‌న‌సేన పార్టీ స‌భ్య‌త్వం తీసుకోన‌ప్ప‌టికి ప‌వ‌న్ గెలుపు కోసం జ‌న‌సైనికుల‌తో క‌లిసి ప‌ని చేస్తాన‌ని వెల్ల‌డించారు.

రానున్న‌ ఎన్నిక‌ల్లో .. తేదేపాకు గ‌ట్టిగా బుద్ధి చెప్పాల‌ని, జ‌న‌సేన‌ను గ‌ద్దెనెక్కించాల‌ని అభిమానుల‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కులాల మ‌ధ్య అధికారం బంధీగా మారింద‌ని, ఈ ప‌రిస్థితితో మార్పు రావాలంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్ అధికారంలోకి రావాల‌న్నారు నాగ‌బాబు. రాజ‌కీయాల్లో త‌మ్ముడు ఒంటరివాడైనా త‌న‌కి అభిమాన‌గ‌ణం భారీగా వుందని చెప్పుకొచ్చారు. ఇక అధికార తెలుగు దేశంపై భారీ స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తేదేపా సామాన్య ప్ర‌జ‌ల‌కు క్ర‌మ క్ర‌మంగా దూర‌మ‌వుతోంద‌ని, లోకేష్‌ని ముఖ్య‌మంత్రిని చేయ‌డ‌మే ధ్యేయంగా చంద్ర‌బాబు నాయుడు ప‌నిచేస్తున్నార‌ని, ఈ ద‌ఫా వారిని ఇంటికి సాగ‌నంపాల‌ని, ఈ విష‌యంలో జ‌న‌సైనికుల‌కు అప్ప‌మత్తంగా వుండాల‌ని మెగాబ్ర‌ద‌ర్ హెచ్చ‌రించారు.

User Comments