కాస్టింగ్ కౌచ్‌పై యాప్‌ భ‌రోసా ఎలా బాసూ?

Last Updated on by

గత కొంతకాలంగా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. శ్రీరెడ్డి ఉదంతం తరవాత ఈ తరహా సమస్య తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు మూవీ ఆర్టిస్టుల సంఘం `మా` చర్యలు చేపడుతోంది. ఆ క్రమంలోనే శాఖలవారీగా ప్రముఖులతో కాష్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కాష్ కమిటీ సైతం పరిష్కరించలేని సమస్యల్ని పరిష్కరిస్తామంటూ .. ఓ కార్పొరెట్ కంపెనీ యాప్ తయారు చేయడం ప్రముఖంగా చర్చకొచ్చింది. ఈ యాప్లో అధికారికంగా రిజిష్టర్ అయిన వారికి పూర్తి భరోసా లభిస్తుందని ప్రచారం సాగిస్తున్నారు. అంతేకాదు.. ఇందులో చేరే ముందు అమ్మాయిలు అయితే వారి తల్లిదండ్రులను సంప్రదించి అనుమతి లభించాకే చేర్చుకుంటారట. ఇక ప్రతిభ ఉన్నవారెవరూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనేలేదు. నేరుగా ఈ యాప్ ద్వారానే ఫలానా చోట ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటూ సమాచారం అందిస్తుందిట.

ఇటీవలే దర్శకుడు మారుతి ఆవిష్కరించిన ఈ యాప్ పేరు `సెలబ్ కనెక్ట్`. ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతా బాగానే ఉంది కానీ, ఇలా యాప్ల ద్వారా నటీమణులకు రక్షణ కల్పించడం ఎంతవరకూ సాధ్య ం. అమ్మా నాన్నల అనుమతి తీసుకున్నా, తీసుకోకపోయినా సమస్య వచ్చేది పరిశ్రమలో అవకాశం అందుకునేప్పుడే కదా! అక్కడ అవసరాన్ని దర్శకనిర్మాతలు, హీరోలు ఎన్క్యాష్ చేసుకుంటున్నారు. పడక సుఖం అందిపుచ్చుకుంటున్నారు. దానిని యాప్లు ఎలా ఆపగలవు? ఇక ఇన్నాళ్లు ఆన్లైన్లో నటీమణుల ప్రొఫైల్స్ వెంటనే దొరికేవి కావు. ఇప్పుడు ఈ యాప్ ద్వారానే ఫలానా నటి ప్రొఫైల్ ఇదీ అంటూ అంతా బయటికి గుట్టు తెలిసిపోతుంది. తద్వారా మరిన్ని చిక్కులొస్తే..? తస్మాత్ జాగ్రత్త!!!

User Comments