`నోటా`లో మురుగ‌దాస్ ఏంటి?

Last Updated on by

ఓట్లు ఆట‌లోకి.. నోట్లాట‌లోకి.. రాజ‌కీయాల్లోకి మురుగ‌దాస్ వెళుతున్నారా? త‌మిళ‌నాట రాజ‌కీయాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్న వేళ అస‌లు మురుగ‌దాస్ నోట్లాట‌లోకి రావ‌డ‌మేంటి? చెక్ దిస్ డీటెయిల్స్..

అవును మురుగ‌దాస్ .. నోట్లాట‌లోకి వ‌స్తున్నారు. మూడు ముక్క‌లాట ఆడేందుకు వ‌స్తున్నారు. త‌న శిష్యుడు ఆనంద్ శంక‌ర్ కోసం ఇంత‌టి సాహసం చేస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న తెలుగు- త‌మిళ్ ద్విభాషా చిత్రం `నోటా` లో ఓ ఆస‌క్తిక‌ర పాత్ర‌లో త‌ళుక్కున మెర‌వ‌బోతున్నారు. ప్ర‌స్తుతం మురుగ‌పై సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నోట మాట రాని ఆనంద్ ట్విట్ట‌ర్‌లో త‌న గురువు మురుగ‌దాస్ తో తాను ఉన్న‌ప్ప‌టి ఫోటోని షేర్ చేసి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యానం చేశారు. “హౌ ప్లెజెంట్ మూవ్‌మెంట్! నా ద‌ర్శ‌కుడిని నేను డైరెక్ట్ చేస్తున్నాను… అత‌డు న‌టుడిగా“ అంటూ ఫోటోతో పాటు కామెంట్‌ని పోస్ట్ చేశారు. అందుకు ప్ర‌తిగా మురుగ‌దాస్ త‌ర్వాత మురుగ‌దాస్ అంత‌టి ద‌ర్శ‌కుడిగా ఎద‌గాల‌ని ఆకాంక్షిస్తూ రిప్ల‌య్‌లు వ‌స్తున్నాయ్‌. ఒకే ఒక్క‌ నిమిషం నిడివి ఉన్న‌ ట్రైల‌ర్‌తోనే గుండె కొల్ల‌గొట్టారు `నోటా` టీమ్‌. ఇది ప‌క్కా డైరెక్ట‌ర్ సినిమా అన‌డంలో సందేహ‌మే లేదు. దేవ‌ర‌కొండ మ‌రో సంచ‌ల‌నానికి తెర తీస్తున్నాడ‌ని ట్రైల‌ర్ చెప్పింది. ఈ చిత్రాన్ని పూర్తి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ సీఎం పాత్ర‌లో న‌టించ‌డం హైలైట్‌. ఇక ఈ సినిమాలో సామాజిక చిత్రాల ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ ఏ పాత్ర‌లో న‌టిస్తున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఆయ‌న ఒక ద‌ర్శ‌కుడిగా క‌నిపిస్తారా.. లేక ఇంకేదైనానా? వేచి చూడాలి.

User Comments