మురుగ‌దాస్ అరెస్ట్ ఖాయ‌మా?

Last Updated on by

స‌ర్కార్ వివాదం ర‌చ్చ‌కెక్క‌డంపై ప్ర‌స్తుతం త‌మిళ‌నాట ఆస‌క్తిక‌రంగా చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమాలో అధికార అన్నాడీఎంకేని, జ‌య‌ల‌లిత‌ను కించ‌ప‌రుస్తూ కొన్ని స‌న్నివేశాలు తెర‌కెక్కించార‌ని వాటిని తొల‌గించాల‌ని రాజ‌కీయ నాయ‌కులు వీరంగం వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే చ‌ర్య ఇద‌ని గొడ‌వ జ‌రుగుతోంది. ఈ సీక్వెన్సులో భాగంగానే ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్‌కి ప్ర‌మాదం పొంచి ఉంద‌నే సంకేతాలు అందాయి.

తాజాగా అత‌డిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని నిన్న‌టి రేయి సంఘ‌ట‌న చెబుతోంది. బ్రేకింగ్ న్యూస్ అంటూ స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ త‌న అధికారిక ట్విట్ట‌ర్‌లో మురుగదాస్ అరెస్టు కోసం పోలీసులు ఇంటికెళ్లారు అంటూ వేయ‌డం సంచ‌ల‌న‌మైంది. ఆ త‌ర్వాత దాని గురించి ప్ర‌స్థావించిన మురుగదాస్ సైతం .. మా ఇంటికి మిడ్ నైట్ పోలీసులు వ‌చ్చి వెళ్లారు. ప‌దే ప‌దే త‌లుపులు త‌ట్టారు. నేను లేన‌ని తెలుసుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు మా ఇంటికి పోలీస్ బందోబ‌స్తు లేనేలేదు! అంటూ త‌న‌దైన శైలిలో వ్యంగ్యంగా స్పందించాడు. దీనిపై ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్, విశాల్ స్పందిస్తూ ఇది చ‌ట్ట విరుద్ధ‌మ‌ని ఖండించారు. సెన్సార్ ఓకే చేసిన సినిమాల్ని ఆపేయ‌డం ఇక్క‌డి ప్ర‌భుత్వాల‌కు మామూలేన‌ని క‌మ‌ల్ హాస‌న్ అన్నారు. దుష్ట రాజ‌కీయాలు అంత‌మై మంచి నాయ‌కులు వ‌స్తార‌ని అన్నారు. మురుగ‌దాస్ అరెస్ట్ స‌రికాద‌ని అన్నారు. సెన్సార్ చ‌ట్ట‌బ‌ద్ధంగా ఓకే చెప్పిన సినిమాని ఆపాల‌నుకోవ‌డం నేర‌మ‌ని ర‌జ‌నీ విమ‌ర్శించారు. ఆ ఇద్ద‌రికి విశాల్ సైతం బాస‌ట‌గా నిలిచారు. కోలీవుడ్ అంతా ఏక‌మై మురుగ‌దాస్‌ని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

User Comments