`రోబో2` లోగుట్టు విప్పిన రెహ‌మాన్‌

Last Updated on by

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్, అక్ష‌య్ కుమార్ వంటి గ్రేట్ స్టార్ల‌తో శంక‌ర్ రూపొందిస్తున్న `2.ఓ` (రోబో2) రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఈ సినిమా వాయిదా ప‌డ‌డంతో ర‌జ‌నీ, శంక‌ర్‌ల ఫ్యాన్స్ అస‌హ‌నంతో ఉన్న మాట వాస్త‌వం. అయితే ఎంత‌గా స‌హ‌నం ప‌రీక్షించినా, ర‌జ‌నీ ఫ్యాన్స్‌కి విజువ‌ల్ ట్రీట్ ఇచ్చేందుకు శంక‌ర్ బృందం చాలానే శ్ర‌మిస్తున్నారు. అప్ప‌టికే ఫెయిలైన వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ వ‌ర్క్‌ని ఎంతో రిస్క్ చేసి, డ‌బ్బు ఖ‌ర్చు చేస్తూ తిరిగి చేయిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే అభిమానుల్లో అశాంతిని అణ‌గ‌దొక్కేందుకు 2.ఓ ని న‌వంబ‌ర్ 29న రిలీజ్ చేస్తున్నామ‌ని, అన్ని ప‌నులు అప్ప‌టికి పూర్తి కానున్నాయ‌ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర దినోత్స‌వ కానుకగా 2.ఓ టీజ‌ర్‌ని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది.

అదంతా అటుంచితే ఈ సినిమా ఓవ‌రాల్ చిత్రీక‌ర‌ణ‌ ప్రాసెస్‌లో శంక‌ర్ బృందంతో క‌లిసి ప‌ని చేసిన స్వ‌ర‌మాంత్రికుడు ఏ.ఆర్‌.రెహ‌మాన్ ఏం చెబుతున్నారు? అంటే.. అత‌డు ఇచ్చిన తాజా స్టేట్‌మెంట్ ఒక్క‌సారిగా ఫ్యాన్స్‌కి ఖంగు తినిపించింది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో మ‌రో విజువ‌ల్ వండ‌ర్‌ని చూడ‌బోతున్నామ‌న్న న‌మ్మ‌కాన్ని రెహ‌మాన్ పెంచ‌గ‌లిగారు. లేటెస్టుగా ఓ టీవీ చానెల్ లైవ్‌లో మాట్లాడిన ఏ.ఆర్‌.రెహ‌మాన్ 2.ఓ చిత్రంలో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌లు తెర‌పై వీక్షిస్తున్నంత సేపూ మ‌న‌సు దోచేస్తార‌(ఫ్యాస్కినేష‌న్‌) ని వ్యాఖ్యానించారు. శంక‌ర్ లాంటి ద‌ర్శ‌కుడు మ‌న‌కు ఉండ‌డం అది మ‌న అదృష్ట‌మ‌ని అన్నారు. ఇందులో ఓ పాట‌ను ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా అద్భుతంగా తెర‌కెక్కించార‌ని కితాబిచ్చారు. అంతేకాదు ఈ సినిమాలో క్లైమాక్స్ అద్భుతంగా కుదిరింద‌ని ఆయ‌న స‌ర్టిఫికెట్ ఇచ్చేయ‌డంతో ఇక ఒకటే అంచ‌నాలు రెట్టింప‌య్యాయి. జెంటిల్‌మేన్ చిత్రం నుంచి శంక‌ర్‌తో క‌లిసి ప‌ని చేస్తున్నారు రెహ‌మాన్‌. ఆయ‌న అంత కాన్ఫిడెంట్‌గా చెప్పారంటే ఇక `2.ఓ` చిత్రంపై ఎలాంటి సందేహాలు అక్క‌ర్లేదన్న‌మాట‌!

User Comments