అర‌వింద స‌మేత సంచ‌ల‌నాలు

Last Updated on by

ఎన్టీఆర్ న‌టించిన `అర‌వింద స‌మేత‌` సంచ‌ల‌నాలు కొన‌సాగుతున్నాయి. డే1లో పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వ‌డంతో ఇటు తెలుగు రాష్ట్రాలు స‌హా అటు ఓవ‌ర్సీస్‌లోనూ ఆడియెన్ థియేట‌ర్ల‌కు భారీగా త‌ర‌లివ‌చ్చారు. దీంతో ఓపెనింగుల్లో రికార్డులు సాధ్య‌మైంది. అర‌వింద స‌మేత నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో ఓవ‌ర్సీస్ ప్రీమియ‌ర్ల రికార్డును అందుకుంది. ఓవ‌రాల్‌గా డే 1లో 27కోట్ల షేర్, డే2లో మ‌రో 8కోట్ల షేర్ క‌లుపుకుని మొత్తంగా 35కోట్ల మేర కేవ‌లం తెలుగు రాష్ట్రాల నుంచి షేర్ (2 రోజుల్లో) వ‌సూలు చేయ‌డం ఓ సంచ‌ల‌నంగా ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఈ సినిమా దాదాపు 60కోట్ల మేర గ్రాస్ వ‌సూలు చేసింద‌ని అంచ‌నా వేస్తున్నారు.

అమెరికాలో బుధ‌వారం -790కె డాల‌ర్లు, గురువారం- 229కె డాల‌ర్లు క‌లుపుకుని ఓవ‌రాల్‌గా 1.02 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలైంద‌ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ తెలిపారు. ఇది 7.50 కోట్ల కు స‌మానం. ఇక తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల వ‌సూళ్లు విడిగా ప‌రిశీలిస్తే.. ఏపీ-తెలంగాణ క‌లుపుకుని డే2లో – 7.95కోట్ల గ్రాస్ వ‌సూలైంది. రెండో రోజు షేర్ ప‌రిశీలిస్తే.. నైజాం-8.55కోట్లు, సీడెడ్- 7.44కోట్లు, నెల్లూరు-1.33కోట్లు, గుంటూరు -4.82కోట్లు, తూ.గో-3.24కోట్లు, ఉత్త‌రాంధ్ర -4.01కోట్లు, ప‌.గో-2.69కోట్లు, కృష్ణ‌-2.51కోట్లు, ఏపీ-తెలంగాణ క‌లుపుకుని రెండ్రోజుల‌కు 34.59కోట్లు వ‌సూలైంది. డే1 ఏరియా వైజ్ వ‌సూళ్లు ఇలా ఉన్నాయి నైజాం-2.83కోట్లు, సీడెడ్ -1.96కోట్లు, నెల్లూరు -0.27కోట్లు, ఉత్త‌రాంధ్ర‌-0.88కోట్లు, తూ.గో జిల్లా-0.47కోట్లు, ప‌.గో జిల్లా-0.32కోట్లు, కృష్ణ‌-0.54కోట్లు, గుంటూరు-0.67కోట్లు వ‌సూలైంది. ఈ మొత్తం రెండు రోజుల‌కు క‌లుపుకుని దాదాపు 35కోట్ల షేర్ వ‌సూలైంది. గ్రాస్ అంత‌కుమించి ఉంటుంది కాబ‌ట్టి సుమారు 60కోట్ల మేర వ‌సూలై ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

User Comments