`రంగ‌స్థ‌లం`ని ట‌చ్ చేశాడు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినాకి `అర‌వింద స‌మేత‌- వీర‌రాఘ‌వ‌` నిద‌ర్శ‌నంగా మార‌నుందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. నిన్న‌టికి నిన్న రిలీజ్ డే నాడే వీర‌రాఘ‌వుని టీమ్ హ‌డావుడిగా హైద‌రాబాద్‌లో స‌క్సెస్‌మీట్‌ని ఏర్పాటు చేసింది. ఈ హ‌డావుడి చూసిన‌ప్పుడే తార‌క్ సినిమాని పెద్ద హిట్ చేయాల‌న్న త‌ప‌న క‌నిపించింది. మ‌రోవైపు అర‌వింద స‌మేత రికార్డుల గురించి చ‌ర్చ మొద‌లైంది.

డే1 యూఎస్‌- ప్రీమియ‌ర్ల రూపంలో ఈ చిత్రం ఏకంగా 5.85 కోట్లు అంటే 792కె అమెరికా డాల‌ర్లు వ‌సూలు చేసింది. ఇది రామ్‌చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం` అమెరికా ప్రీమియ‌ర్ల కంటే పెద్ద మొత్త‌మే. రంగ‌స్థ‌లం 707కె అమెరికా డాల‌ర్లు ప్రీమియ‌ర్ల‌తో వ‌సూలు చేసింది. అంత‌కంటే 85 డాల‌ర్లు ఎక్కువే అర‌వింద‌ వ‌సూలు చేయ‌డం విశేషం. ఇక‌పోతే నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నెల‌కొల్పిన అమెరికా ప్రీమియ‌ర్ల రికార్డును మాత్రం వీర‌రాఘ‌వుడు బ్రేక్ చేయ‌లేక‌పోయాడు. అజ్ఞాత‌వాసి చిత్రం 1.1 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌తో ఇప్ప‌టికీ ప్రీమియ‌ర్ రికార్డుల్లో టాప్‌లో నిలిచింది.

User Comments