అర‌వింద స‌మేత పాజిటివిటీ

Last Updated on by

`అర‌వింద స‌మేత` ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ అంటూ స‌మీక్ష‌లు వ‌చ్చేశాయి. త్రివిక్ర‌మ్ ఈజ్ బ్యాక్.. అంటూ 3 రేటింగ్ ఇచ్చి అంతా పొగిడేశారు. తార‌క్ కెరీర్ బెస్ట్ యాక్ష‌న్ ఎమోష‌న‌ల్ చిత్ర‌మిద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. కొంద‌రు అబౌ యావ‌రేజ్ అంటూ టాక్ వినిపించారు. మొత్తానికి పాజిటివ్ టాక్ తోనే ఈ సినిమా ఓపెనింగుల రిపోర్ట్ బెట‌ర్‌మెంట్ ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇక‌పోతే `అర‌వింద స‌మేత` ఏరియా వైజ్ అమ్మ‌కాల దృష్ట్యా ప‌రిశీలిస్తే.. రిట‌ర్నుల్లో సేఫ్ అని చెప్పాలంటే ఈ చిత్రం ఎంత వ‌సూలు చేయాలి? అన్న‌దానికి ప్రీరిలీజ్ లెక్క‌ల్ని మ‌రోమారు ప‌రిశీలించాలి. ఈ సినిమా మొత్తం వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలో 91 కోట్ల బిజినెస్ చేసింది. అందులో ఏపీ+నైజాం క‌లుపుకుని 67 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగించింది. నైజాం- 17 కోట్లు, సీడెడ్ 14కోట్లు ఇత‌ర చోట్లు క‌లుపుకుని ఇంత పెద్ద మొత్తం బిజినెస్ సాగించింది. కర్నాట‌క 8.1కోట్లు, ఓవ‌ర్సీస్ 14.4 కోట్లు, ఇత‌ర ఇండియా బిజినెస్ 1.5కోట్లు పూర్త‌యింది. అందుకే ఆ మొత్తాల్ని అర‌వింద స‌మేత వెన‌క్కి తేవాల్సి ఉంది. ఇక‌పోతే అమెరికాలో ప్రీమియ‌ర్ల రూపంలోనే 1మిలియ‌న్ (6కోట్లు సుమారు) వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నాలేర్ప‌డ్డాయి. టాక్ బావుంది కాబ‌ట్టి, ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో పాటు రికార్డులు సృష్టించే వీలుందని భావిస్తున్నారంతా. 91కోట్ల బిజినెస్ చేసింది కాబ‌ట్టి ఆ మేర‌కు షేర్ వ‌సూలు చేస్తే పెద్ద హిట్టు కిందే లెక్క అని అంచనా వేస్తున్నారు.

User Comments