ఆర్భాజ్ వ్య‌స‌నం.. వ‌ద్ద‌న్న మ‌లైకా

Last Updated on by

బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్‌ఖాన్ ఇప్ప‌టికే కృష్ణ జింక‌ల వేట కేసులో న‌లిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే జోధ్‌పూర్ కోర్టు అత‌డికి వ్య‌తిరేకంగా తీర్పు వెలువ‌రించింది. ఆ గొడ‌వ స‌ద్ధుమ‌ణ‌గ‌క‌ముందే స‌ల్మాన్ సోద‌రుడు ఆర్భాజ్ ఖాన్ అడ్డంగా పోలీస్ కేసులో బుక్క‌య్యాడు. ఐపీఎల్‌లో బెట్టింగ్‌కి పాల్ప‌డ్డాన‌ని పోలీసుల ముందు అంగీక‌రించి ప్ర‌స్తుతం విచార‌ణ ఎదుర్కొంటున్నాడు. ఆర్భాజ్ రూ. 2.8 కోట్ల మేర బెట్టింగులో న‌ష్ట‌పోయి బుకీతో గొడ‌వ‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఆర్భాజ్ గుట్టు మొత్తం స‌ద‌రు బుకీ పోలీసుల‌కు చెప్పేశాడు. అటుపై అతడిని క్రైమ్ సెల్ విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక‌పోతే పోలీసుల విచార‌ణ‌లో ఆర్భాజ్ వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిశాయి.

ఆర్భాజ్ నుంచి భార్య మ‌లైకా అరోరాఖాన్‌ విడిపోవ‌డానికి కార‌ణం వేరొక‌టి ఉంది అంటూ ప్ర‌చారం సాగుతోంది. ఆర్భాజ్ ఆలోచ‌న‌ల్లో ఆర్థిక స్థిర‌త్వం లేదు. త‌ప్పుడు మార్గాల్లో సంపాద‌న కోసం, జ‌ల్సాల కోసం ఖ‌ర్చు చేసేస్తాడుట‌. అయితే ఆ విష‌యాల‌పై మ‌లైకా ఎన్నోసార్లు హెచ్చ‌రించినా అత‌డు పెడ‌చెవిన పెట్టేసేవాడు. ఐపీఎల్‌లో బెట్టింగులు వంటివి వ‌ద్ద‌ని వారించినా ఆర్భాజ్ విన‌లేదు. ఇది ఇరువురి మ‌ధ్యా స‌ప‌రేష‌న్‌కు దారి తీసింద‌ని తెలుస్తోంది. బెట్టింగులు వంటి వాటి విష‌యాల్లో ఆర్భాజ్‌కి అన్న‌ స‌ల్మాన్‌తో పాటు, తండ్రి స‌లీమ్ ఖాన్‌ చెప్పినా విన‌లేదు. చివ‌రికిలా చెప్పిన‌మాట విన‌నివాడిగా ప‌శ్చాత్తాప‌ప‌డే ప‌రిస్థితి త‌లెత్తింది. 2016లో ఆర్భాజ్ – మ‌లైకా జంట విడిపోయినప్పుడు ఆ స‌ప‌రేష‌న్‌కి కార‌ణం మ‌లైకా అంటూ ప్ర‌చారం సాగింది. యువ‌హీరో అర్జున్‌క‌పూర్‌తో మ‌లైకా డేటింగ్ చేయ‌డం వ‌ల్ల‌నే విడిపోయార‌ని, లేదూ వేరొక బిజినెస్‌మేన్‌తో మ‌లైకా సన్నిహితంగా ఉండ‌డం వ‌ల్ల‌నే విడిపోయార‌ని ర‌క‌ర‌కాలుగా ప్ర‌చార‌మైంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇందులో ఓ కొత్త కోణం ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

User Comments