బ‌న్ని-సుక్కుకి ప‌ర్మిష‌న్ లేదా?

Allu Arjun Sukumar Film AA20 Multi-lingual

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు  సుకుమార్ కాంబినేష‌న్ లో చిత్తూరు నేప‌థ్యం.. ఎర్ర‌చంద‌నం స్మింగ్లింగ్ నేప‌థ్యంలో  ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి  తెలిసిందే. ఇటీవ‌లే సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం సుకుమార్ లోకేష‌న్ల‌ను అన్వేషిస్తున్నాడు. రియాల్టీ మిస్ కాకుండా డీప్ ఫారెస్ట్ అయిన‌ శేషాచ‌లం  కొండల్లోని అడ‌వుల్లోనే చిత్రీక‌ర‌ణ చేయాల‌ని భావించారు. ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ ఆ కొండ‌ల్లోనే  అధికంగా ల‌భిస్తుంది. త‌మిళ‌నాడు-ఆంధ్ర ప్ర‌వేదేశ్, క‌ర్ణాట‌క రాష్ట్రాల స‌రిహ‌ద్దు ప్రాంతం.. ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతం కావ‌డంతో స్మ‌గ్లింగ్ కి ఇది అనువైన ప్రాంతం.

అయితే ఇక్క‌డ బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ని మ‌రో కోణం దాగి ఉంది. ఆ ప్రాంతం ఎంతో ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది. క్రూర మృగాలు న‌డియాడే చోటు అది. చిరుత‌పులులు.. సింహాలు తిరిగే డేంజ‌ర్ జోన్. అయినా దానికి వెర‌వ‌క‌ సుక్కు కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను నైట్ ఎఫెక్ట్ లో అక్కడ షూట్ చేస్తేనే బాగుంటుంద‌ని భావించాడు. కానీ ఆ ప్రమాద‌క‌ర ఏరియాలో షూటింగ్ కి  అనుమ‌తి దొర‌క‌లేదుట‌. అధికారులు ప‌ర్మిష‌న్ కు నిరాక‌రించిన‌ట్లు స‌మాచారం. దీంతో చిత్తూరు షెడ్యూల్ లో షూట్ చేయాల్సిన  కీల‌క స‌న్నివేశాలు మొత్తం బ్యాంకాక్ అడ‌వుల్లోకి షిప్ట్ చేస్తున్న‌ట్లు తెలిసింది. అయితే బ్యాంకాక్ ఫారెస్ట్ లో షూటింగ్ చేస్తే ఆ ఎగ్జైట్ మెంట్- థ్రిల్ మిస్ అయ్యే అవ‌కాశం లేక‌పోలేదు.