అర్జున్ రెడ్డి అవుతున్న అర్జున్..

Last Updated on by

ఏడాదికి ఎన్నో సినిమాలు వ‌స్తుంటాయి పోతుంటాయి.. కానీ చ‌రిత్ర‌లో నిలిచిపోవ‌డానికి.. మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్పుకోడానికి మాత్రం ఎప్పుడో ఓసారి ఒక్క సినిమా వ‌స్తుంది. అలాంటి సినిమా అర్జున్ రెడ్డి. 2017లో వ‌చ్చిన ఈ చిత్రం టాలీవుడ్ లో స‌రికొత్త చరిత్ర‌కు తెర‌తీసింది. అప్ప‌ట్లో శివ‌ సినిమా ఎంతటి సంచ‌ల‌నం సృష్టించిందో.. ఇప్పుడు అర్జున్ రెడ్డి కూడా అంతే. పాత్ బ్రేకింగ్ సినిమాగా నిలిచిపోయింది. చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యంగా నిలిచింది అర్జున్ రెడ్డి. అడ‌ల్ట్స్ ఓన్లీ అంటూ వ‌చ్చిన ఈ చిత్రం 26 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది. ఇక రీమేక్ రైట్స్.. శాటిలైట్ అన్నీ క‌లిపితే మ‌రో 10 కోట్ల‌ వ‌ర‌కు వ‌చ్చాయి. అంతా చేస్తే ఈ చిత్రం బ‌డ్జెట్ 3 కోట్ల‌కు మించ‌లేదు. అంటే నిర్మాత‌ల‌కు ప‌దిహేను రెట్లు లాభం. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కాదు.. బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్.

ఈ చిత్రం ఇప్ప‌టికే త‌మిళ‌నాట బాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ ఇందులో హీరో. ఇక ఇదే సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ కానుంది. ఈ రీమేక్ లో ముందు ర‌ణ్ వీర్ సింగ్ అనుకున్నారు కానీ ఇప్పుడు అర్జున్ క‌పూర్ వ‌చ్చాడు. అర్జున్ రెడ్డి రీమేక్ పై ఈ కుర్ర హీరో బాగానే ఆస‌క్తి చూపిస్తున్నాడు. ఆ మ‌ధ్య‌ ద‌ర్శ‌కుడు సందీప్ వంగా వెళ్లి బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్న య‌శ్ రాజ్ సంస్థ ప్ర‌తినిథుల‌ను క‌లిసొచ్చాడు. య‌శ్ రాజ్ చేతుల్లోకి అర్జున్ రెడ్డి వెళ్లాడంటే హిందీలో రెడ్డిగారి రేంజ్ మారిపోయిన‌ట్లే. ఇక దీనికి అర్జున్ క‌పూర్ లాంటి హీరో తోడైతే మ‌న సినిమా పిచ్చెక్కించ‌డం ఖాయం. కేవ‌లం 3.2 కోట్ల‌తో తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కు 26 కోట్ల షేర్.. 45 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించింది. మ‌రి ఇత‌ర భాష‌ల్లో దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి..!

User Comments