శ్రీ‌దేవి మ‌ర‌ణంపై కొడుకు నో కామెంట్స్.. కారణం?

Last Updated on by

శ్రీ‌దేవి జీవితంలో అతిముఖ్య‌మైన వ్య‌క్తులు చాలా త‌క్కువ మంది ఉన్నారు. అందులో ఎలాగూ భర్త బోనీక‌పూర్ ముందు వ‌ర‌స‌లో ఉంటాడు. ఆ త‌ర్వాత కూతుళ్లు ఉన్నారు. కానీ ఆమె జీవితంలో మ‌రో వ్య‌క్తి కూడా ఉన్నాడు. అత‌డే అర్జున్ క‌పూర్. బోనీక‌పూర్ మొద‌టి భార్య మౌనీ క‌పూర్ కొడుకు అర్జున్ క‌పూర్. ఈమె ఐదేళ్ల కిందే చనిపోయింది. చిన్న‌ప్ప‌ట్నుంచి కూడా శ్రీ‌దేవి అంటే అర్జున్ కు ప‌డ‌దు. ఆమెను త‌న పిన‌త‌ల్లిగా కూడా ఎప్పుడూ చూడ‌లేదు ఈ హీరో. త‌న తండ్రిని శ్రీ‌దేవి త‌న నుంచి దూరం చేసింద‌నే భావ‌నే అర్జున్ లో చిన్న‌ప్ప‌ట్నుంచీ నాటుకుపోయిందంటారు ఈయ‌న్ని ద‌గ్గ‌ర‌గా చూసినోళ్లు. ఇప్పుడు శ్రీ‌దేవి చ‌నిపోయింది. ఈ విషయంపై అర్జున్ క‌పూర్ ఎలా స్పందిస్తాడో అని ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

శ్రీ‌దేవి చ‌నిపోయిన త‌ర్వాత కూడా అర్జున్ క‌పూర్ ప్ర‌వర్తించిన తీరు అంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. శ్రీ‌దేవి అత‌డికి సొంత త‌ల్లి కాదు.. పిన‌త‌ల్లి. ఎంత పిన‌త‌ల్లి అయినా కూడా రిలేష‌న్ అయితే ఉంటుంది క‌దా.. పోయిన‌పుడు బాధ ఉంటుంది క‌దా అనుకున్నారంతా. కానీ ఆ ఫీలింగ్స్ ఏవీ ఇప్పుడు అర్జున్ లో క‌నిపించ‌ట్లేదు. అస‌లు ఆమె బ‌తికున్న‌పుడే పెద్ద‌గా ప‌ట్టించుకోని అర్జున్.. ఇప్పుడు ఎలా స్పందిస్తాడో అని ఆశించ‌డం అత్యాశే. అదే జ‌రిగింది కూడా. ముంబై ఎయిర్ పోర్ట్ లో శ్రీ‌దేవి మ‌ర‌ణం గురించి మాట్లాడ‌మ‌ని మీడియా అడుగుతుంటే కెమెరాల‌ను తోసేసి బ‌య‌టికి వెళ్లిపోయాడు అర్జున్. ఆ త‌ర్వాత ఇంటి ద‌గ్గ‌ర కూడా సేమ్ సీన్ రిపీట్ చేసాడు.

ఎంత కోపాలు ఉన్నా కూడా మ‌నిషి పోయిన త‌ర్వాత కూడా అవి చూపించ‌డం మాత్రం మంచిది కాదంటున్నారు. కానీ అర్జున్ క‌పూర్ కోణం నుంచి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయ‌న కోపంలో అర్థం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కైతే ఈయ‌న ముంబైలోని అనిల్ క‌పూర్ ఇంట్లోనే వ‌చ్చీ పోయే బంధువుల‌తో ఉన్నాడు. మ‌రోవైపు శ్రీ‌దేవి పెద్ద కూతురు ఝాన్వి కూడా ముంబైలోనే ఉంద‌ని తెలుస్తుంది. ఆమెను అన్న‌గా అర్జున్ క‌పూరే ఓదారుస్తున్నాడు. శ్రీ‌దేవి ఉన్న‌పుడు చెల్లెళ్ల‌తో పెద్ద‌గా మాట్లాడ‌ని అర్జున్ ఇప్పుడు మాత్రం అన్న‌గా త‌న బాధ్య‌త నిర్వ‌ర్తిస్తున్నాడ‌ని తెలుస్తుంది.

User Comments