అర్జున్‌రెడ్డి 2.Oతో జీవిత 2.O

Last Updated on by

అర్జున్‌రెడ్డి చిత్రంలో డ్ర‌గ్ అడిక్ట్ ల‌వ‌ర్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజీ న‌ట‌న‌ను ఎవ‌రూ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. అలాంటి రెక్లెస్ కుర్రాడికి ఒక త‌మ్ముడు ఉన్నాడు అన‌గానే చెవులు రిక్కించి, క‌ళ్లు పెద్ద‌వి చేసి చూశారు. అవును దేవ‌ర‌కొండ‌కు ఓ త‌మ్ముడు ఉన్నాడు. అత‌డి పేరు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. ఇప్పుడు అత‌డు హీరో అవుతున్నాడు. అన్న త‌ర‌హాలోనే ఓ ప్ర‌యోగం చేసేందుకు రెడీ అవుతున్నాడు. `పెళ్లి చూపులు` త‌ర‌హాలోనే ప్ర‌యోగాత్మ‌కంగా `దొర‌సాని` అనే చిత్రంలో ఈ యువ‌కుడు న‌టించ‌నున్నాడ‌ట‌. ఇక‌పోతే ఇదే సినిమాతో జీవిత రాజ‌శేఖ‌ర్ రెండో కుమార్తె, శివానీ సోద‌రి శివాత్మిక క‌థానాయిక‌గా ప‌రిచ‌యం కానుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అంటే దొర‌సానితో ల‌వ్‌లో దేవ‌ర‌కొండ 2.O సినిమా ఇద‌ని చెప్పొచ్చు.

క్రేజీగా అర్జున్‌రెడ్డి 2.Oతో జీవిత 2.O ల‌వ్‌స్టోరీగానూ దీనిని చెప్పగ‌లం. ఎందుకంటే శివాత్మిక అచ్చం త‌ల్లిపోలికే. జీవిత నోట్లోంచి పుట్టిన‌ట్టే ఉంటుంది. అచ్చు ఆమె రూప‌మే కావ‌డంతో జీవిత 2.O అని అభిమానులు పిలుచుకోవ‌డం గ్యారెంటీ. ఇక ఆనంద్ -శివాత్మిక జంట‌ను తెర‌కు ప‌రిచ‌యం చేసే బ‌రువు బాధ్య‌త‌ల్ని అగ్ర‌నిర్మాత డి.సురేష్‌బాబు తీసుకోవ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాకి కెవిఆర్ మ‌హేంద్ర అనే డెబ్యూ ద‌ర్శ‌కుడు కెప్టెన్సీ వ‌హిస్తార‌ట‌. ఇక జీవిత పెద్ద కుమార్తె శివ‌నీ ఇప్ప‌టికే అడ‌వి శేష్ స‌ర‌స‌న `గూఢ‌చారి` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలోనూ ఓ సినిమా చేస్తోంది.

User Comments