అర్జున్‌రెడ్డి హిందీలోకి డ‌బ్బింగ్

టాలీవుడ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను రాత్రికి రాత్రి స్టార్‌ను చేసిన చిత్రం `అర్జున్‌రెడ్డి`. ఈ చిత్రాన్ని హిందీతో పాటు ప‌లు ద‌క్షిణాది భాష‌ల్లో రీమేక్ చేశారు. అక్క‌డ కూడా ఈ సినిమా రీమేక్ లో న‌టించిన హీరోల భ‌విత‌వ్యాన్నే మార్చేసింది. షాహిద్ క‌పూర్ కెరీర్‌తో పాటు అత‌ని మార్కెట్ రేంజును పెంచేంత సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. అయినా ఇంకా ఈ సినిమాపై ఉత్త‌రాది వారికి ముఖ్యంగా బాలీవుడ్ మీడియాకు, ప్రేక్ష‌కుల‌కు మ‌మ‌కారం చావ‌లేదు.

ఈ చిత్ర మాతృకలో న‌టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దాన్ని క్యాష్ చేసుకోవ‌డం కోసం `అర్జున్‌రెడ్డి` చిత్రాన్ని హిందీలో డ‌బ్బింగ్ రూపంలో రిలీజ్ చేశారు కూడా. ఈ సినిమా స్టార్ గోల్డ్‌లో త్వ‌ర‌లో ప్ర‌సారం కాబోతోంది. `ఒరిజిన‌ల్ `అర్జున్‌రెడ్డి`ని చూడండి` అనే స్లోగ‌న్‌తో ఈ చిత్ర ప్రీమియ‌ర్ కోసం ఛాన‌ల్ బృందం ప్ర‌చారం మొద‌లుపెట్టింది. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ బాలీవుడ్‌లో పీక్ స్టేజ్‌కు చేరిపోయింది. సెలబ్రిటీల పార్టీల‌కు విజ‌య్‌ని ఆహ్వానించే స్థాయికి విజ‌య్ క్రేజ్ పెర‌గ‌డం ప‌లువురు టాలీవుడ్ స్టార్స్‌ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.