హాట్ షాక్.. లీకైన అర్జున్ రెడ్డి ఇంట్రో సీన్

టాలీవుడ్ ను ఊపేస్తున్న అర్జున్ రెడ్డి ఇంకొన్ని గంటల్లోనే థియేటర్స్ లో రచ్చరచ్చ చేయబోతున్న విషయం అందరికీ తెలుసు. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియదు గాని, ప్రస్తుతం జనాలు ముఖ్యంగా యూత్ అర్జున్ రెడ్డి పేరు చెబితే చాలు రెచ్చిపోతున్నారు. అంతలా క్రేజీగా ఉంది కాబట్టే.. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ పేరు చెప్పి అర్జున్ రెడ్డి బాగానే వెనకేశాడని టాక్ వచ్చేసింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ ఎ సర్టిఫికెట్ హార్డ్ హిట్టింగ్, బోల్డ్ కంటెంట్, స్ట్రాంగ్ రొమాంటిక్ ఎమోషనల్ సినిమాలో ఇంట్రో సీన్ ఇదే అంటూ ఓ స్టోరీ లీక్ అవడం హాట్ షాక్ గా మారింది. అదేంటంటే, సినిమా ఓపెనింగ్ లో డ్రగ్స్ కి, మందుకి బాగా అలవాటు పడ్డ విజయ్ దేవరకొండ తన ఫ్లాట్ లోని సోఫాలో నిద్రపోతూ ఉంటాడట.
ఈ సందర్బంగా అతని ముందు చాలా మద్యం సీసాలు చెల్లాచెదురుగా పడి ఉంటాయట. ఇదే సమయంలో సోఫాకి ఓ వైపు నుంచి సన్నటి నీటిధార కనిపిస్తుందట. అప్పుడు పొద్దున్నే లేచి టాయిలెట్ కి వెళ్ళడానికి కూడా బద్ధకం వేసి సోఫా లోనే మూత్రం పోసే క్యారెక్టర్ అర్జున్ రెడ్డిది అంటూ ఓ ఓవర్ వాయిస్ వచ్చి సినిమా మొదలవుతుందని సమాచారం. మరి ఈ లీకైన ఇంట్రో స్టోరీ ఎంతవరకు నిజమో తెలియదు గాని, వింటుంటేనే అదోలా ఉన్న ఈ బోల్డ్ స్టోరీ కాసేపట్లో థియేటర్స్ లో ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి. ఆ మాటకొస్తే సినిమాలోని చాలా సీన్స్ ఇలానే బోల్డ్ గా స్ట్రాంగ్ గా రియలిస్టిక్ గా ఉన్నాయని అంటున్నారు. ఏదిఏమైనా, ఇంట్రో తోనే అర్జున్ రెడ్డి ఈ రేంజ్ లో పిచ్చెక్కించాడంటే.. అది నిజంగా హాట్ షాక్ అనే అనాలి. మొత్తంగా సినిమా ఫలితం అయితే, ఇంకొన్ని గంటల్లోనే తేలిపోనుంది కాబట్టి కొంచెం సహనం మాత్రం పాటించాల్సిందే.