అర్జున్ సుర‌వ‌రం మూవీ రివ్యూ

న‌టీన‌టులు:  నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి, స‌త్య, త‌రుణ్ అరోరా, వెన్నెల కిషోర్, పోసాని త‌దిత‌రులు
రిలీజ్ తేదీ: 29 న‌వంబ‌ర్ 2019
జోన‌ర్: థ‌్రిల్ల‌ర్, ఇన్వెస్టిగేటివ్ ఎంట‌ర్ టైన‌ర్
బ్యాన‌ర్: మూవీ డైన‌మిక్స్ ఎల్.ఎల్.పి-ఆరా సినిమాస్
స‌మ‌ర్ప‌ణ‌:  బి.మ‌ధు
ద‌ర్శ‌క‌త్వం:  టి.ఎన్‌.సంతోష్‌

ముందుమాట‌:
వైవిధ్య‌మైన క‌థ కంటెంట్ ఉన్న సినిమాల‌తో మెప్పించిన న‌టుడు నిఖిల్. అందుకే అత‌డు ఓ క‌థ‌ను ఎంచుకున్నాడంటే దానిపై మార్కెట్ వ‌ర్గాల్లో అభిమానుల్లో న‌మ్మ‌కం. ఈసారి జ‌ర్న‌లిజం బ్యాక్ డ్రాప్ లో థ్రిల్ల‌ర్ ట్రై చేస్తున్నాడు అన‌గానే అంతా ఆస‌క్తిగా వేచి చూశారు. అయితే టైటిల్ వివాదం… ఆర్థిక స‌మ‌స్య‌లు అంటూ ర‌క‌రకాల కార‌ణాల‌తో సినిమా రిలీజ్ ఆల‌స్య‌మైంది. అయినా ఒకే ఒక్క ట్రైల‌ర్ తో ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు స‌హా అభిమానులు తలెత్తి చూసేలా చేయ‌గ‌లిగారు. ప్రీరిలీజ్ వేడుక‌కు మెగాస్టార్ పెద్ద బూస్ట్ ఇవ్వ‌డం క‌లిసొచ్చింది. న‌వంబ‌ర్ 29న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రిలీజైంది. నిఖిల్ పై న‌మ్మ‌కంతో వేచి చూసిన‌ అభిమానుల అంచ‌నా నిజ‌మైందా లేదా? అత‌డు ఈసారి కూడా మాస్ట‌ర్ క్లాస్ స్క్రిప్టునే ఎంచుకున్నారా?  ఈ చిత్రం జ‌నాల‌కు ఎంత‌వ‌ర‌కూ రీచ్ అవుతుంది? అన్న‌ది తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

సింగిల్ లైన్:
ఒక స్థిర‌మైన‌ గోల్ తో సాగిపోయే ఓ జ‌ర్న‌లిస్ట్ జీవితంలో ఊహించ‌ని ట్విస్టుతో అత‌డు ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు?  చుట్టూ ప‌రిస్థితులు ఎలా మారాయి? అన్నిటినీ ఎదురించి అత‌డు కంబ్యాక్ అయ్యాడా లేదా? అన్న‌దే ఈ సినిమా క‌థాంశం. ఒక జ‌ర్న‌లిస్ట్ జీవితంలో సీరియ‌స్ లైఫ్ స్టోరి ఇద‌ని చెప్పొచ్చు.

క‌థాక‌మామీషు:
అర్జున్ లెనిన్ సురవరం(నిఖిల్) టీవీ 99 రిపోర్ట‌ర్. ఇన్వెస్టిగేష‌న్ .. స్టింగ్ ఆప‌రేష‌న్ లో స్పెష‌లిస్టు. అత‌డికి బీబీసీ ఛానల్లో జర్నలిస్ట్ అవ్వాల‌న్న‌ది ఆశ‌. దానికోసం చాలానే హార్డ్ వ‌ర్క్ చేస్తాడు. అలా బీబీసీ జాబ్ అందుకున్న అర్జున్ అటుపై ఓ ప‌రిశోధ‌న‌కు శ్రీ‌కారం చుడ‌తాడు. సాహసోపేత‌మైన ఈ ఇన్వెస్టిగేష‌న్ వ‌ల్ల త‌న‌కు ఊహించ‌ని ముప్పు ఎదుర‌వుతుంది. అర్జున్ అనూహ్యంగా ఓ కేసులో ఇరుక్కుంటాడు. అలాగే మరో వైపు ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేసే ఓ భయంకరమైన మాఫియా గుట్టును అతడు బ‌య‌ట‌పెడ‌తాడు. అయితే త‌న‌పై బుక్క‌యిన బ్యాంక్ స్కాం కేసు వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చాయి?  ఆ అప‌నింద నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అర్జున్ ఏం చేశాడు? అత‌డి క‌థ‌లో హీరోయిన్ లావణ్య ఎలాంటి పాత్ర పోషించింది? అర్జున్ చుట్టూ ఉచ్చు వేసిన ఆ పెద్ద మ‌నిషి ఎవ‌రు?  చివ‌రికి ఈ క‌థ సుఖాంత‌మా..  కాదా? అన్న‌ది తెలియాలంటే తెర‌పై చూడాల్సిందే.

ఒక మామూలు రిపోర్ట‌ర్ బీబీసీ రిపోర్ట్ గా ఎదిగే క్ర‌మంతో పాటు ఇంట‌ర్వెల్ లో అదిరిపోయే బ్యాంగ్ తో నేరేష‌న్ ఆక‌ట్టుకుంటుంది. ఆరంభం కొంచెం నెమ్మ‌దిగా అనిపించినా క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ మోడ్ లోకి వెళ్ల‌గానే ఉత్కంఠ పెరుగుతుంది. ఫ‌స్టాఫ్ లెంగ్తీ అనిపించినా ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. ఇక ఇంట‌ర్వెల్ ముందు విల‌న్ బంధువు మ‌ర‌ణంతో క‌థలో సీరియ‌స్ నెస్ వేడెక్కిస్తుంది. సెకండాఫ్ ఆద్యంతం ఇదే సీరియ‌స్ మోడ్ లో సాగ‌డంతో కామెడీ.. రొమాన్స్ ఇత‌ర‌త్రా ఆహ్లాదం ఏమైనా మిస్స‌వుతున్నామా? అన్న ఫీల్ ఆడియెన్ కి క‌లుగుతుంది. సినిమా చెత్త‌గా ఉంది అన‌డానికేం లేదు. ఫ‌ర్వాలేదు. అలాగ‌ని గొప్ప‌గానూ లేదు అని ఆడియెన్ కి అర్థ‌మ‌వుతుంది. కీల‌క స‌మ‌యంలో విల‌న్ త‌రుణ్ ఆరోరా ప్ర‌వేశంతో స్క్రీన్ మ‌రింత వేడెక్కుతుంది. ఇక క్లైమాక్స్ ముందు నిఖిల్ పోలీస్ స్టేష‌న్ నుంచి త‌ప్పించుకుని మ‌రీ ఇన్వెస్టిగేష‌న్ చేయ‌డం అన్న‌ది .. తాను అప‌రాధిని కాను అని నిరూపించుకోవడం సినిమాటిక్ లిబ‌ర్టీ అనే అనిపిస్తుంది. ఒక జ‌ర్న‌లిస్ట్ జీవితంలో సీరియ‌స్ లైఫ్ స్టోరి ఇది అని చెప్పొచ్చు. నిఖిల్ మ‌రోసారి క‌థ ప‌రంగా త‌న‌దైన సెలెక్ష‌న్ తో మెప్పించాడు. అయితే తెర‌కెక్కించిన విధానంలో మ‌రింత గ్రిప్ పెంచేందుకు ప్ర‌య‌త్నించాల్సింది.

న‌టీన‌టులు:
జ‌ర్న‌లిజం గౌర‌వాన్ని పెంచేలా జ‌ర్న‌లిస్టు పాత్ర‌లోకి సింక్ అయ్యాడు నిఖిల్. అత‌డు మ‌రోసారి త‌న భుజ‌స్కంధాల‌పై సినిమాని న‌డిపించాడు. లావ‌ణ్య త్రిపాఠి త‌న పాత్ర ప‌రిధి మేర‌కు ఓకే. త‌రుణ్ అరోరా విల‌నీ ఆక‌ట్టుకుంది. వెన్నెల కిషోర్.. స‌త్యా ఓకే.

టెక్నీషియ‌న్స్:
ద‌ర్శ‌కుడు సంతోష్ ప‌నిత‌నం భేష్ అనిపిస్తుంది. ఎంచుకున్న క‌థాంశం బావుంది. ఫ‌స్టాఫ్ సంతృప్తిక‌రంగా మ‌లిచి సెకండాఫ్ ని వేగంగా ప‌రిగెత్తేలా తీర్చిదిద్ద‌గ‌లిగాడు. చిన్న‌పాటి త‌ప్పులు చేసినా ఓవ‌రాల్ గా ఫ‌ర్వాలేద‌నిపించే సినిమా తీశాడు. మాస్ కంటే మ‌ల్టీప్లెక్స్ చేరువ‌య్యే సినిమా ఇది. సంగీతం పాట‌లు బావున్నాయి. బీజీఎం మ‌రింత బెట‌ర్ గా చేసి ఉండాల్సింది. లెంగ్త్ త‌గ్గేలా ఎడిటింగ్ మ‌రింత షార్ప్ గా చేయాల్సింది.  ఇత‌ర విభాగాలు ఓకే. ఇక సినిమా భారీ లాభాలు తేలేక‌పోయినా సేఫ్ జోన్ కి చేరే విష‌యం ఉంద‌ని చెప్పొచ్చు.

ప్ల‌స్ పాయింట్స్:

*ఎంచుకున్న క‌థాంశం, థ్రిల్ల‌ర్ మోడ్
* నిఖిల్ న‌ట‌న‌

మైన‌స్ పాయింట్స్:

* సెకండాఫ్ లో సీరియ‌స్ నెస్
* లెంగ్త్

ముగింపు:
ప‌వ‌ర్ ఆఫ్ మీడియా.. `అర్జున్ సుర‌వ‌రం` ఒక‌సారి చూడొచ్చు

రేటింగ్:
2.75 /5