అర్జున్ సుర‌వ‌రం సీక్వెల్

యంగ్ హీరో నిఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన అర్జున్ సుర‌వ‌రం ఇటీవ‌ల విడుద‌లై  పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే.  ప్రేక్ష‌కుల నుంచి  సినిమాకు మాత్రం మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. రివ్యూల‌కు అతీతంగా సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రాణిస్తోంది. తొలి వారం వ‌సూళ్లు బాగున్నాయ‌ని ఇప్ప‌టికే టాక్ వినిపిస్తోంది. దీంతో  కొన్ని ఏరియాల్లో అద‌నంగా థియేట‌ర్ల సంఖ్య కూడా పెంచారు. అయితే అర్జున్ సురవ‌రంకి అసలు ప‌రీక్ష ఈ సోమ‌వారం నుంచి ఎదురు కానుంది.

నిఖిల్ కి పేరొచ్చింది.. మంచి థీమ్ ఉన్న సినిమా అన్న టాక్ వ‌చ్చింది కాబ‌ట్టి.. అర్జున్ సుర‌వ‌రంకు సీక్వెల్ తీసే ఛాన్సుంద‌ట‌. ఇప్ప‌టికే పార్ట్ 2 ఐడియా ద‌ర్శ‌కుడు టి.ఎన్ సంతోష్ మైండ్ లో ఉంద‌ని స‌మాచారం. అర్జున్ సుర‌వ‌రం కు సంబంధించిన అంతిమ ఫ‌లితం తేలిన త‌ర్వాత దీనిపై మ‌రింత అప్ డేట్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ సీక్వెల్  చేస్తే గ‌నుక ఇదే టీమ్ యథావిధిగా ముందుకువెళ్ల‌నున్న‌ట్లు  తెలుస్తోంది.