అర్జున్ సురవరం టైమ్ బ్యాడ్!

నిఖిల్ అంటే సెల‌క్టివ్ గా క్రియేటివ్ గా ఉండే హీరో. రొటీన్ కి భిన్నంగా చ‌క్క‌ని క‌థాంశాల్ని ఎంచుకుని స‌త్తా చాటుతున్న హీరో. అందుకే అభిమానులు స‌హా మార్కెట్ వ‌ర్గాల్లోనూ ఆస‌క్తి ఉంటుంది. కానీ ఈసారి ఏమైందో కానీ అర్జున్ సుర‌వ‌రం కి అది ఎంత‌మాత్రం క‌లిసి వ‌చ్చిన‌ట్టు లేదు. మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ప్రీరిలీజ్ వేడుక‌కు విచ్చేసినా ఏమాత్రం క‌లిసొచ్చిన‌ట్టే లేదు.

తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల కు అర్జున్ సురవరం రైట్స్ అమ్మారు. ఏపీ, నైజాంలో ఈ సినిమాకు మొదటి రోజు కోటి 35 లక్షల రూపాయల షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 4.10 కోట్ల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ చెబుతున్నారు. అయితే తొలిరోజు ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప రెడ్లు రావ‌క‌పోవ‌డం ప్ల‌స్ అనుకున్నా.. కానీ నిఖిల్ రేంజుకు ఓపెనింగులు రాలేదు. ఫుల్ ర‌న్ లో 9 కోట్ల గ్రాస్ వచ్చి బ్రేక్-ఈవెన్ అయినా దాన్ని సేఫ్ అన‌లేని ప‌రిస్థితి. ఏడాది కిందట రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా చాలా ఆర్థిక కష్టాలు చూసింది. ఏడాది పాటు లక్షల్లో వడ్డీలు కట్టారు. అవన్నీ కలుపుకుంటే ఈ సినిమాకు 9 కోట్లు వచ్చినా నిర్మాతకు లాభం కింద రాదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన షేర్ ప‌రిశీలిస్తే..

నైజాం -రూ. 0.31 కోట్లు, సీడెడ్ – రూ. 0.17 కోట్లు, ఉత్తరాంధ్ర – రూ. 0.19 కోట్లు, ఈస్ట్ – రూ. 0.12 కోట్లు, వెస్ట్ – రూ. 0.10 కోట్లు, గుంటూరు – రూ. 0.29 కోట్లు, నెల్లూరు – రూ. 0.09 కోట్లు, కృష్ణా – రూ. 0.12 కోట్లు అని తేలింది. రిలీజ్ వాయిదా అనేది ప్ర‌తిబంధ‌కం. ఆ ప్ర‌భావం వ‌సూళ్ల‌పై క‌నిపించింది. మంచి కంటెంట్ ఉంది అని టాక్ వచ్చినా కొన్ని సంగ‌తులు వ‌సూళ్ల‌కు లాక్ వేసేశాయి. ఇక ప్ర‌తి సినిమాకి మంచి రిలీజ్ ఎంతో ముఖ్యం అని నిర్మాత‌లు అర్థం చేసుకోవాల్సి ఉంది.