`అర్జున్‌రెడ్డి 2` మిస్ చేస్కుని..

Last Updated on by

అర్జున్‌రెడ్డి సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ రేంజ్ ఒక్క‌సారిగా మారిపోయింది. అయితే ఈ సినిమా కోసం ఇంచుమించు అలాంటి వేరొక సినిమాని విజ‌య్ వ‌దులుకున్నాడు. అయితే ఆర్‌.ఎక్స్ 100 క‌థ‌నే విజ‌య్ వ‌దులుకున్నాడ‌ట‌.

ఆర్‌.ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ – ఈ సినిమా క‌థ‌ను పెళ్లి చూపులు ముందే విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు చెప్పాను. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్య ం చూసి అత‌డితో చేయాల‌నుకుంటే .. త‌ర్వాత చేద్దామ‌ని అన్నాడు. అయితే ఎందుక‌నో కుద‌ర‌లేదు. అయితే కార్తికేయ‌ దొర‌క‌డం నా అదృష్టం. అత‌డు పెర్ఫెక్ట్‌గా ఆ పాత్ర‌కు కుదిరాడు. కొత్త కుర్రాళ్లు అయినా బాగా చేశారు. ఈ సినిమాకి చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అద్భుతంగా కుదిరింది. ఇక మా నిర్మాత‌లు రాజీ లేకుండా ఈ చిత్రాన్ని నిర్మించ‌డం బాగా క‌లిసొచ్చింది. ఆర్‌.ఎక్స్ 100 ట్రైల‌ర్‌కి అద్భుత స్ప ంద‌న వ‌చ్చింది. టైటిల్‌కి త‌గ్గ‌ట్టే సౌండ్, ఎఫెక్ట్స్ విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాం. ఈనెల 12న థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌నే భావిస్తున్నాం అని అన్నారు.

User Comments