అర్జున్‌రెడ్డి బ్రో.. వీడింకా రెబ‌ల్‌

Last Updated on by

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌కి ఓ రెబ‌ల్ ప‌రిచ‌యం అయ్యాడు. విజ‌య్ దేవ‌ర‌కొండలోని రెబ‌లిజం ఏ రేంజులో ఉంటుందో అంద‌రికీ తెలిసొచ్చింది. `పెళ్లి చూపులు` సినిమాలో ఎంత సాఫ్ట్‌బోయ్‌గా క‌నిపించాడో.. అందుకు పూర్తి డిఫ‌రెంట్‌గా రెండో సోలో సినిమాలో రెబ‌లిజం చూపించాడు. ముక్కుసూటిగా మాట్లాడే అర్జున్‌రెడ్డిని తెలుగు ప్రేక్ష‌కులు ఎంతో మెచ్చుకున్నారు… థియేట‌ర్ల‌లో ఆద‌రించారు. ఒక అప్‌కం హీరోని ఏకంగా ఓవ‌ర్‌నైట్‌ స్టార్‌ని చేశారు. ప‌క్కా ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో చ‌క్క‌ని ల‌వ్‌స్టోరీతో వ‌స్తే తెలుగు ప్రేక్ష‌కులు నెత్తిన పెట్టుకుని పూజిస్తారు అని ఆ సినిమా నిరూపించింది.

అందుకే ఇప్పుడు అర్జున్‌రెడ్డి అలియాస్ దేవ‌ర‌కొండ‌కు ఓ త‌మ్ముడు ఉన్నాడు అన‌గానే అంద‌రిలోనూ ఒక‌టే క్యూరియాసిటీ. వార‌సులు రాజ్య‌మేలుతున్న ఇండ‌స్ట్రీ ఇది. ఇలాంటి చోట త‌మ్ముళ్లు, కూతుళ్లు, కొడుకులు ఉంటే అంతే సంగ‌తి. వెంట‌నే ముఖానికి మేక‌ప్ వేసుకుని వారస‌త్వ పోరు మొద‌లు పెట్టేస్తారు. ఇప్పుడు అర్జున్‌రెడ్డి అలియాస్ దేవ‌ర‌కొండ‌ త‌మ్ముడు కూడా బ‌రిలో దిగుతాడా? అన్న సందేహాలొస్తున్నాయి. ఇదిగో ఇక్క‌డ ఫ్యామిలీ ఫోటోలో అర్జున్‌రెడ్డి బ్రో జేసీ దివాక‌ర్ రెడ్డిలా చాలా యారొగెంట్‌గా క‌నిపిస్తున్నాడు. సీమ‌లో నెత్తురు పారించే బ్యాచీ కుర్రాడిలా ఆ ముఖంలో కళ కొట్టొచ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. ఒక‌వేళ దేవ‌ర‌కొండ తెలివిగా అత‌డిని బ‌రిలో దించుతాడా ఏం.. అంటూ ఒక‌టే ముచ్చ‌ట్లాడుకుంటుండ్రు! అర్జున్‌రెడ్డి బ్రో.. వీడింకా రెబ‌ల్‌గా క‌న‌బ‌డుతున్నాడ‌బ్బా!!

User Comments