న‌టి సురేఖావాణి భ‌ర్త మృతి

టాలీవుడ్ న‌టి సురేఖావాణి భ‌ర్త సురేష్ తేజ మృతి చెందారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యం కార‌ణంగా బాధ‌ప‌డుతోన్న సురేష్ తేజ సోమ‌వార ఉద‌యం మ‌ర‌ణించారు. సురేష్ కూడా టీవీ, ఫిల్మ్ రంగానికి చెందిన‌వారే. ప‌లు టీవీషోల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సురేఖావాణి-సురేష‌ల‌ది ప్రేమ వివాహం. సురేఖా టీవీ యాంక‌ర్ గా ఉన్న స‌మ‌యంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సురేష్ తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మాటాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ షోల‌లో సురేష్ యాంక‌ర్ గా ప‌నిచేసారు.

కాగా సురేష్ మృతిప‌ట్ల ప‌లువురు టీవీ ఆర్టిస్టులు, అసోసియేష‌న్లు సంతాపం ప్ర‌క‌టించాయి. సురేష్ తేజ త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్ర‌స్తుతం సురేఖా వాణి టాలీవుడ్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు స్టార్ హీరోలంద‌రి సినిమాల్లో ఆమె కీల‌క పాత్ర‌లు పోషిస్తోంది.