నానీలా మ్యాజిక్ చేయ‌లేక‌..!?

Last Updated on by

అనుకున్న‌దొక్క‌టి.. అయిన‌దొక్క‌టి బోల్తా కొట్టిందిలే బురుబురు పిట్టా! .. ఈ సామెత‌ను గుర్తు చేస్తోంది ఈ త‌మిళ సినిమా రిజల్ట్‌. నాని `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` త‌మిళ రీమేక్ ఇచ్చిన ఝ‌ల‌క్ గురించే ఇదంతా. అస‌లింత‌కీ ఏమైంది.. అంటే..?

గ‌త కొంతకాలంగా ఆర్య క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న `గ‌జినికాంత్` గురించి త‌మిళ మీడియాలో హోరెత్తిపోయింది. ఈ సినిమాలో ఆర్య మ‌తిమ‌రుపు కుర్రాడిగా ప్ర‌యోగం చేస్తున్నాడ‌ని.. హిట్టు కొడ‌తాడ‌ని ప్ర‌చారం సాగింది. అయితే తానొక‌టి త‌లిస్తే అన్న చందంగా ఆర్య సినిమా రిజ‌ల్ట్ పూర్తి ఆపోజిట్‌గా రావ‌డంపై త‌మిళ విమ‌ర్శ‌కులు ఏకి ప‌డేశారు. నాని హీరోగా న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` రిజ‌ల్ట్‌ని రిపీట్ చేయ‌డంలో గ‌జినికాంత్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. స్టార్‌హీరో ఆర్య‌.. త‌ప్పులో అడుగేశాడ‌న్న టాక్ వినిపించింది. ఇక ఈ సినిమాలో నానీలా కామెడీ పండించలేక ఆర్య విఫ‌ల‌మ‌య్యాడ‌న్న విమ‌ర్శ‌లు రావ‌డం మ‌రో బ్యాడ్‌. అంత పెద్ద హీరో కామెడీలో పెద్ద ట్రాక్ ఉన్న హీరో ఇలా విఫ‌ల‌మ‌వ్వ‌డ‌మేంటో అన్న చ‌ర్చా సాగుతోంది. ఇక‌పోతే నాని సినిమాని త‌మిళ ఆడియెన్ అభిరుచికి త‌గ్గ‌ట్టు తీయ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడ‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మొత్తానికి ఇక్క‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ అక్క‌డ నెగెటివ్ ఫ‌లితాన్ని ఇవ్వ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

User Comments