అసుర‌న్ రీమేక్ క‌ష్టాలు తీరేదెలా

ఇరుగు పొరుగున హిట్ట‌యిన సినిమాల్ని క్యాచ్ చేయ‌డం వాటిని రీమేక్ చేయ‌డంలో అగ్ర‌నిర్మాత డి.సురేష్ బాబు ప‌నిత‌నం గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఆ కోవ‌లోనే ఆయ‌న ఇప్ప‌టికే ఎన్నో చిత్రాల్ని రీమేక్ చేశారు. తాజాగా ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన అసుర‌న్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. సురేష్ బాబుతో క‌లిసి ఈ చిత్రాన్ని క‌ళైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా ద‌ర్శ‌కుడి కోసం సెర్చ్ కొన‌సాగుతోంది.

అయితే ఎవ‌రిని ఎంపిక చేయ‌బోతున్నారు? అన్న స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం ఇద్ద‌రు ముగ్గురు సీనియ‌ర్ ద‌ర్శ‌కులు వేరే సినిమాలు చేయ‌కుండా అందుబాటులో ఉన్నారు. వీళ్ల‌లో సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వీవీ వినాయ‌క్ ఇప్ప‌టికే వెంకీతో సినిమా చేసేందుకు ఆసక్తిగానే ఉన్నారు. ఆయ‌న రాక‌తో బిజినెస్ రేంజ్ పెరుగుతుంది. ఓపెనింగుల‌కు ఈ హిట్ కాంబో ప్ల‌స్. ఇక‌పోతే రీమేక్ ని తెలుగైజ్ చేసి క్లాసిక్ గా నిల‌బెట్ట‌డంలో క్రిష్ లాంటి ద‌ర్శ‌కుడు మెప్పించ‌గ‌ల‌దు. మ‌రి వీళ్ల‌లో ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కుతుంది? అన్న‌ది చూడాలి. ఈ చిత్రంలో శ్రీ‌య‌ను ఓ క‌థానాయిక‌గా ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. వెంకీ-శ్రీ‌య జంట అన‌గానే సుభాష్ చంద్ర‌బోస్-2005, తుల‌సి -2007, గోపాల గోపాల -2015 చిత్రాలు గుర్తుకు వ‌స్తాయి. మ‌రోసారి ఈ కాంబినేష‌న్ రిపీట‌వుతోంది. వెంకీ ప్ర‌స్తుతం డిసెంబ‌ర్ లో రిలీజ్ కానున్న వెంకీమామ డ‌బ్బింగ్ ప‌నుల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.