మ‌రో అథ్లెట్ బ‌యోపిక్‌

Last Updated on by

కిలాడీ అక్ష‌య్‌కుమార్ న‌టించిన `ప్యాడ్‌మ్యాన్‌` ఓ ఆద‌ర్శ రైతు బ‌యోపిక్ అన్న సంగ‌తి తెలిసిందే. ఆడ‌వారి మెన్‌స్ట్రువ‌ల్ స‌మ‌స్య‌ల్ని ఎలివేట్ చేస్తూ త‌క్కువ ధ‌ర‌ ప్యాడ్స్ రూప‌క‌ర్త అయిన ఓ సాధార‌ణ ప‌త్తి రైతు జీవిత‌క‌థ‌ను అద్భుతంగా తెర‌కెక్కించారు. త‌న‌వైన తెలివితేట‌ల‌తో ఖాన్‌ల త్రయంతో పోటీప‌డుతూ ఫోర్బ్స్ జాబితాలో పేరు సంపాదించాడంటే కిలాడీ మాట‌కు ఎంత విలువ ఉంటుందో నికార్సుగా అంచ‌నా వేయాలి.

అందుకే అత‌డి నోటి నుంచి ఓ పేద‌ క్రీడాకారిణి బ‌యోపిక్ తెర‌కెక్కించాల‌న్న మాట వినిపించిందంటే అది ఎంతో ఉన్న‌త‌మైన‌ద‌ని అర్థం చేసుకోవాలి. ధోని, స‌చిన్‌, సైనా, సానియాల‌పై ఎవ‌రైనా బ‌యోపిక్‌లు తీస్తారు. కానీ ఎలాంటి సౌక‌ర్యాలు లేని మారుమూల గ్రామం నుంచి వ‌చ్చి ఇండియాకి తొలి గోల్డ్‌మెడ‌ల్ అందించిన ట్రాక్ అథ్లెట్ హిమ‌దాస్ జీవిత‌క‌థ‌ను తెర‌పై చూపించాల‌న్న ఇంగితం ఎవ‌రికైనా ఉందా? అథ్లెట్‌ మిల్కా సింగ్ బ‌యోపిక్ అంత ఉత్కంఠ ఉంటుందా? మ‌రో భాగ్ మిల్కా భాగ్ అవుతుందా? అన్న‌ది ప‌క్క‌న పెడితే ఈ సినిమా తీయాల‌న్న ఆలోచన గ్రేట్. ఇండియా తొలి ట్రాక్ అథ్లెట్ కం గోల్డ్ మెడ‌లిస్ట్ హిమ‌దాస్ బ‌యోపిక్ తెర‌కెక్కించాల‌ని అక్కీ ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌డం మైండ్ బ్లోవింగ్ ఫీట్‌. అక్ష‌య్‌కుమార్ ప్లానింగ్‌లో ఉన్నారు కాబ‌ట్టి ఆయ‌నే ఈ బ‌యోపిక్‌ని నిర్మించే రియ‌ల్ గోల్డ్ అని అర్థ‌మ‌వుతోంది. క‌పిల్‌దేవ్‌, సైనా నెహ్వాల్, పుల్లెల గోపిచంద్‌పైనా బ‌యోపిక్‌లు ఎవ‌రైనా తీస్తారు. కానీ హిమ‌దాస్ బ‌యోపిక్ తీసి మెప్పించాలి. అదీ గొప్ప‌త‌నం.

User Comments