యంగ్ టైగ‌ర్‌కి ట‌చ్‌లో అట్లీ

Jr. NTR - File Photo

కోలీవుడ్‌లో యంగ్ ఫేవ‌రేట్ డైరెక్ట‌ర్ అట్లీకుమార్‌. ద‌ర్శ‌క‌జీనియ‌స్ శంక‌ర్ వ‌ద్ద రెండు మూడు చిత్రాల‌కు డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేసిన అట్లీ ఆ త‌రువాత ఆర్య, న‌య‌న‌తార న‌టించిన `రాజా రాణి` సినిమాతో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే. తొలి సినిమానే 50 కోట్ల క్ల‌బ్‌లో చేర‌డంతో అత‌నితో సినిమాలు నిర్మించేందుకు నిర్మాత‌లు పోటీప‌డ్డారు. ఇటీవ‌ల వ‌రుస‌గా విజ‌య్‌తో డబ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ల‌ని అందిస్తున్న అట్లీ క్రేజ్ త‌మిళ ఇండ‌స్ట్రీని దాటి టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చేరింది.

ఇప్ప‌టికే తెలుగులో అట్లీతో క‌లిసి సినిమా చేయ‌డానికి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రెడీ అయిపోయాడు. మైత్రీ మూవీమేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. తాజాగా త‌న‌తో సినిమా చేయ‌డానికి అట్లీకి షారుఖ్ బిగ్ డీల్‌ని ఆఫ‌ర్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఒక సినిమా కాకుండా ఏకంగా త‌న‌తో మూడు చిత్రాల‌కు అగ్రిమెంట్ కుదుర్చుకున్న‌ట్లు తెలుస్తోంది. షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ నిర్మించ‌నుంది. ఇందులో తొలి చిత్రాన్ని డిసెంబ‌ర్‌లో ప్రారంభించ‌బోతున్నార‌ట‌. దీనికి `సంకీ` అనే టైటిల్‌ని కూడా ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఓవైపు కింగ్ ఖాన్ తో భారీ చిత్రాలు తీస్తున్న అట్లీ కుమార్ మ‌రోవైపు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి అశ్వ‌నిద‌త్ కి ట‌చ్ లో ఉన్నాడ‌ట‌. అశ్వ‌నిద‌త్ చాలా కాలంగా తార‌క్ తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అట్లీతో క‌థా చ‌ర్చ‌లు సాగిస్తున్నారు. అయితే ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అది కాస్తా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. మ‌రి 2020లో అయినా తార‌క్ – అట్లీ జోడీ సెట్స్ కెళ‌తారా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో అట్లీ తార‌క్ ని క‌లిశార‌ని ఇంకా ట‌చ్ లోనే ఉన్నార‌ని ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తోంది.