అంచ‌నాలు పెరిగిపోతున్నాయి చైతూ

Last Updated on by

సాధార‌ణంగా నాగ‌చైత‌న్య సినిమా అంటే పెద్ద‌గా అంచ‌నాలు ఉండ‌వు. విడుద‌ల‌కు ముందు వ‌ర‌కు.. విడుద‌లైన త‌ర్వాత బాగుందంటేనే ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ కు వ‌స్తారు కానీ మ‌రీ మాస్ హీరోల రేంజ్ లో ఓపెనింగ్స్ ఉండ‌వు.. అంచ‌నాలు కూడా ఉండ‌వు. కానీ కెరీర్ లో తొలిసారి చైతూ సినిమాపై కూడా భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. అదే స‌వ్య‌సాచి. ఈయ‌న చేస్తోన్న స‌వ్య‌సాచి ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలోనే ఫ‌స్ట్ టైమ్ వ‌స్తోన్న క‌థ‌. హీరో బాడీలో ఓ భాగంతో సంబంధం లేకుండా ఉండ‌టం..! ఇలాంటి క‌థ‌తో నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి తెర‌కెక్క‌బోతుంది. అంటే రెండు చేతుల‌తోనూ నైపూణ్యం చూపించే వాడు అని అర్థం. భార‌తంలో ఒక్క అర్జునుడికి మాత్ర‌మే ఈ టాలెంట్ ఉంది. అందుకే అత‌డిని స‌వ్య‌సాచి అంటారు. ఇప్పుడు నాగ‌చైత‌న్య సినిమాలో కూడా ఇదే కాన్సెప్ట్.

ఈ చిత్రంలో హీరో ఎడ‌మ‌చేయి త‌న ఆధీనంలో ఉండ‌దు. అంటే కుడిచేయికి.. ఎడ‌మ‌చేయికి అస‌లు సంబంధం ఉండ‌దు. తాను చేయాల‌నుకున్న‌ది అది చేస్తూ పోతుంది. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే చైతూ ఎడ‌మ‌చేయికి కూడా కుడిచేయికి ఉన్నంత బ‌లం ఉంటుంది. కానీ ఆ చేయి బాడీ ఆధీనంలో ఉండ‌దు. దీనివ‌ల్ల హీరోకు ఎలాంటి క‌ష్టాలు వ‌చ్చాయి అనేది క‌థ‌. విన‌డానికే చాలా కొత్త‌గా ఉంది ఈ క‌థ‌. దీన్ని స‌రిగ్గా చెబితే తెలుగులో ఓ ట్రెండ్ సెట్ట‌ర్ అయిపోతుంది స‌వ్య‌సాచి. ప్రేమ‌మ్ లాంటి క్లాస్ సినిమా త‌ర్వాత చందూ-చైతూ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న సినిమా ఇది. నిధి అగ‌ర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది.  సినిమా జులైలో విడుద‌ల కానుంది. మ‌రి.. ఈ పెరుగుతున్న అంచ‌నాల‌ను చైతూ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాడో..

User Comments