అవెంజ‌ర్స్‌-2 ఇండియా రికార్డులు

Last Updated on by

ఒకే సినిమాలో అంద‌రు సూప‌ర్‌హీరోల్ని చూసే అవ‌కాశం క‌ల్పిస్తే అలాంటి ఛాన్స్‌ను మిస్ చేసుకుంటారా? .. ఈ ఫార్ములా బాక్సాఫీస్ వ‌ద్ద ఓ రేంజులో వ‌ర్క‌వుట‌వుతుంద‌ని మార్వ‌ల్ సంస్థ ఎంత మాత్రం ఊహించి ఉండ‌దు. క‌నీసం డిస్నీ సంస్థ సైతం ఇది క‌ల‌గ‌ని ఉండ‌దు. మొత్తానికి ఫార్ములా అద్భుతంగా వ‌ర్క‌వుటైంది. సూప‌ర్‌హీరోలంద‌రినీ గంప‌గుత్త‌గా చూసేందుకు, భారీ యాక్ష‌న్ విన్యాసాలు తెర‌పై 3డిలో చూసేందుకు వ‌ర‌ల్డ్‌వైడ్ ఆడియెన్ క్యూ క‌డుతున్నారు. మార్వ‌ల్ స్టూడియోస్ సంస్థ ఈ ఏడాది `బ్లాక్ పాంథ‌ర్` త‌ర‌వాత‌ మ‌రో బంప‌ర్ హిట్ అందుకుంది. `అవెంజ‌ర్స్ – ఇన్‌ఫినిటీ వార్‌` ఇంటా బ‌య‌టా రికార్డులు తిర‌గ‌రాస్తోంది. అమెరికాలో ఇప్ప‌టికే `స్టార్ వార్స్‌- ది ఫోర్ష్ అవేకెన్స్‌` త‌ర‌వాతి స్థానం అందుకుంది. ఇండియాలోనూ అదే తీరుగా రికార్డు స్థాయి వ‌సూళ్లు సాధించింది.
`అవెంజ‌ర్స్ 2` ఓపెనింగ్ డే వ‌సూళ్ల‌లో `ప‌ద్మావ‌త్‌` రికార్డునే కొట్టేసింది. డే1లో ప‌ద్మావ‌త్ 18 కోట్లు వ‌సూలు చేస్తే, అవెంజర్స్ 2 ఏకంగా 31.3 కోట్ల షేర్ (40 కోట్ల గ్రాస్‌) వ‌సూలు చేసింది. ఒక హాలీవుడ్ సినిమా ఇండియాలో ఈ రేంజులో వ‌సూలు చేయ‌డం అన్న‌ది ఓ సెన్సేష‌న్ అనే చెప్పాలి. డే1లో కేవ‌లం 20 కోట్ల లోపు వ‌సూలు చేయొచ్చ‌ని ట్రేడ్ అంచ‌నా వ‌స్తే అంచ‌నాల్ని త‌ల్ల‌కిందులు చేసి, ఏకంగా డ‌బుల్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తొలి వీకెండ్‌లో ఈ చిత్రం `ది జంగిల్ బుక్‌` రికార్డుల్ని స‌వ‌రిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కేవ‌లం మూడు రోజుల్లోనే 100 కోట్లు వ‌సూలు చేయ‌డం ఖాయం అన్న అంచనాలేర్ప‌డ్డాయి. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా `అవెంజ‌ర్స్ 2` 15000 కోట్లు వ‌సూలు చేసింది ఇప్ప‌టికే.

User Comments