పాథ్‌ బ్రేకింగ్‌ అవెంజ‌ర్స్ వార్

Last Updated on by

ప్ర‌స్తుతం ఏ నోట విన్నా `అవెంజ‌ర్స్‌-ఇన్‌ఫినిటీ వార్‌` గురించే. `అవెంజ‌ర్స్‌` భారీ స‌క్సెస్ నేప‌థ్యంలో ఈ సీక్వెల్ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ‌వుతోంది. రిలీజ్ ముందే మార్వ‌ల్ సినిమా టిక్కెట్ విండో వ‌ద్ద ప్ర‌కంప‌నాలు సృష్టిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన సూప‌ర్‌హీరోలంతా ఈ సినిమాలో గంప‌గుత్త‌గా ఒకేచోట క‌నిపిస్తుండ‌డంతో జ‌నాల్లో అంత‌కంత‌కు క్యూరియాసిటీ రెయిజ్ అయ్యింది. అందుకు త‌గ్గ‌ట్టే ఇలా బుకింగ్స్ ఓపెన్ అవ్వ‌గానే ఆన్‌లైన్ ఠారెత్తిపోయిందిట‌. ఇక ఓపెనింగుల్లో అవెంజ‌ర్స్- 2 భారీ రికార్డులు న‌మోదు చేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

ఈనెల 27న అవెంజ‌ర్స్ 2 రిలీజవుతోంది. అటు అమెరికా స‌హా ప్ర‌పంచ‌దేశాల్లో రిలీజ‌వుతున్న ఈ చిత్రానికి భార‌త‌దేశంలోనూ అంతే క్రేజు నెల‌కొంది. ఇండియా వ్యాప్తంగా దాదాపు 2000 థియేట‌ర్ల‌లో 2డి, 3డి వెర్ష‌న్ల‌ను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా మార్వ‌ల్ సంస్థ‌కు చెందిన గ‌త చిత్రాలు బ్లాక్ పాంథ‌ర్, స్టార్ వార్స్ రికార్డుల్ని, కామెరూన్ అవ‌తార్ రికార్డుల్ని బ్రేక్ చేస్తుంద‌న్న అంచ‌నాలున్నాయి. తెలుగులోనూ భారీగానే రిలీజ‌వుతోంది కాబ‌ట్టి భ‌ళ్లాల‌దేవ రానా చేత డ‌బ్బింగ్ చెప్పించారు. వాస్త‌వానికి మే 4న అవెంజ‌ర్స్ 2 వ‌ర‌ల్డ్ ప్రీమియ‌ర్లు వేయాల‌ని భావించినా అంత‌కు వారం ముందే ఈ సినిమా రిలీజ‌వుతోంద‌ని తెలుస్తోంది. జూలై 6న `యాంట్ మేన్‌`, 2019 మార్చి 8న `కెప్టెన్ మార్వ‌ల్‌` చిత్రాలు ఇదే సంస్థ నుంచి అత్యంత భారీగా రిలీజ్ కానున్నాయి. అలాగే `అవెంజ‌ర్స్‌-ఇన్‌ఫినిటీ వార్‌` సీక్వెల్ 3 మే 2019న రిలీజ్ కానుంది. ఇంకా ఈ చిత్రానికి టైటిల్ నిర్ణ‌యించ‌లేదు.

User Comments