6600 కోట్ల వ‌సూళ్ల‌తో ధ‌మాకా

అవెంజ‌ర్స్ – ఇన్‌ఫినిటీ వార్` సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. ఈ సినిమా తొలిరోజు వ‌సూళ్లు, తొలి వీకెండ్ రికార్డుల్ని స‌వ‌రించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌సూళ్ల ధ‌మాకా మోగిస్తోంది. ఇక ఇండియా నుంచి దాదాపు 150 కోట్లు పైగా వ‌సూలు చేసి ఇప్ప‌టికీ అసాధార‌ణ వ‌సూళ్లు సాధిస్తోంది. ట్రేడ్ రిపోర్ట్ ప్ర‌కారం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 6600 కోట్లు (1బిలియ‌న్ డాల‌ర్స్‌) వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఈ ఫీట్ కేవ‌లం 11 రోజుల్లోనే సాధించిన ఏకైక సినిమాగా రికార్డుల‌కెక్కింది.

అంతేకాదు ఇప్ప‌టివ‌ర‌కూ స్టార్‌వార్స్‌- ది ఫోర్స్ అవేకెన్స్ పేరిట ఉన్న రికార్డును అవెంజ‌ర్స్-2 బ్రేక్ చేసింది. బ్లాక్ పాంథ‌ర్‌, టైటానిక్‌, అవ‌తార్ వంటి సంచ‌ల‌న‌ చిత్రాల రికార్డుల్ని తిర‌గ‌రాసింది. ఇన్నాళ్లు అగ్ర స్థానాన్ని ప‌దిలంగా కాపాడుకున్న స్టార్‌వార్స్ ఫ్రాంఛైజీ సైతం అవెంజ‌ర్స్- 2 ముందు త‌ల‌వొంచింది. `స్టార్ వార్స్ – ది ఫోర్స్ అవేకెన్స్` 12 రోజుల్లో సాధించిన వ‌సూళ్ల‌ను ఒక‌రోజు ముందే అంటే, 11రోజుల్లోనే `అవెంజ‌ర్స్ 2` సాధించింది. ఇప్ప‌టికి నంబ‌ర్ 1 స్థానాన్ని అందుకుంది.