1.17ల‌క్ష‌ల కోట్ల‌తో టాప్‌4 లో

`అవెంజ‌ర్స్‌-ఇన్‌ఫినిటీ వార్‌` సంచ‌ల‌నాలు కొన‌సాగుతున్నాయ్‌. ఈ సినిమా తొలి వీకెండ్ రికార్డుల‌తో పాటు, తొలి వారం రికార్డుల్లో హ‌వా సాగించింది. `స్టార్ వార్స్‌-ది ఫోర్స్ అవేకెన్స్` రికార్డుల్ని సైతం బ్రేక్ చేసి, బిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ సినిమాల్లో టాప్ 10లో చోటు ద‌క్కించుకుంది. ఇక‌ ఫుల్ ర‌న్ రికార్డుల్ని వేటాడుతూ టాప్ 5లో చోటు సంపాదించుకునేందుకు దూసుకెళుతోంది.

`అవెంజ‌ర్స్- 2` ఇప్ప‌టికి వ‌ర‌ల్డ్ వైడ్ 1.17ల‌క్ష‌ల కోట్లు(1.72 బిలియ‌న్ డాల‌ర్లు) సంపాదించింది. ప్ర‌పంచంలోనే నాలుగో అతి పెద్ద బాక్సాఫీస్ మూవీగా `ఇన్‌ఫినిటీ వార్` సంచ‌ల‌నం సృష్టించింది. ది గ్రేట్ `జురాసిక్ వ‌ర‌ల్డ్` సృష్టించిన 1.67 బిలియ‌న్ డాల‌ర్ రికార్డుని `అవెంజ‌ర్స్ -ఇన్‌ఫినిటీవార్‌` బ్రేక్ చేసింది. ఇక ఫుల్ ర‌న్ రికార్డుల వేటను సాగిస్తోంది. ఫుల్ ర‌న్ రికార్డుల్లో.. అవ‌తార్ -2.8 బిలియ‌న్ డాల‌ర్ల‌తో నంబ‌ర్ -1 స్థానంలో ఉండ‌గా, టైటానిక్ -2.2 బిలియ‌న్ డాల‌ర్ల‌తో రెండో స్థానంలో ఉంది. స్టార్ వార్స్ – ఫోర్సెస్ అవేకెన్స్‌- 2.1 బిలియ‌న్ డాల‌ర్ల‌తో మూడో స్థానంలో నిలిస్తే, అవెంజ‌ర్స్ 2 ఏకంగా 1.72 బిలియ‌న్ డాల‌ర్ల‌తో నాలుగో స్థానం ఆక్ర‌మించింది. అవెంజ‌ర్స్-2 హ‌వాతో `జురాసిక్ వ‌ర‌ల్డ్‌` ఐదో స్థానానికి జ‌రిగింది. ఒక‌టి, రెండు, మూడు వారాల్లో స్టార్‌వార్స్ – దిఫోర్స్ అవేకెన్స్ టాప్ 1 పొజిష‌న్‌లో ఉంటే, అవ‌తార్ టాప్‌-5లో ఉంది. ఫుల్‌ర‌న్‌లో అవ‌తార్ నంబ‌ర్ -1 స్థానంలో ఉన్న సంగ‌తి తెలిసిందే.