అవ‌తార్‌కే దిమ్మ‌తిరిగేలా!

Last Updated on by

`అవ‌తార్` రికార్డులు వెన‌క్కి వెళ్లాయ్‌. `స్టార్‌వార్స్` నెక్ట్స్‌ నేనే పెద్ద‌న్న అని నిరూపించింది. అంతెందుకు మొన్న‌టికి మొన్న రిలీజై సంచ‌లన వ‌సూళ్లు సాధించిన `బ్లాక్ పాంథ‌ర్‌`ని రికార్డుల ప‌రంగా కిందికి తోసేసింది. ఇంత‌కీ ఏ సినిమా? అంటే.. అదే `అవెంజ‌ర్స్ : ఇన్‌ఫినిటీ వార్‌`. ఈ సినిమా రిజ‌ల్ట్ ఊహాతీతం. వాస్త‌వానికి ఈ సినిమాకి చాలా ముందు నుంచే హాలీవుడ్‌లో నెగెటివ్ రివ్యూలు మొద‌ల‌య్యాయి. మార్వ‌ల్ సంస్థ తెరకెక్కించిన సూప‌ర్‌హీరో సినిమాల్లోనే చెత్త సినిమా అని కొంద‌రు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. కానీ అవేవీ `అవెంజ‌ర్స్‌-2` ముందు నిల‌బ‌డ‌లేదు.

అమెరికా బాక్సాఫీస్ వ‌ద్ద `స్టార్ వార్స్- ది ఫోర్స్ అవేకెన్స్‌` 248 మిలియ‌న్ డాల‌ర్ల‌తో టాప్ -1 తొలి వీకెండ్ ఓపెన‌ర్‌గా నిలిచింది. ఆ త‌ర‌వాత స్థానంలో స్టార్ వార్స్ – ది లాస్ట్ జేడీ, అవ‌తార్ ఉండేవి. అవ‌తార్‌ని వెన‌క్కి నెట్టి బ్లాక్ పాంథ‌ర్ రికార్డులు కొట్టేసింది. ఇప్పుడు వీట‌న్నిటి రికార్డుల్ని తొలి వీకెండ్‌లో `అవెంజ‌ర్స్ 2` బ్రేక్ చేసింది. అవ‌తార్‌, బ్లాక్ పాంథ‌ర్ కంటే పైన రికార్డుల సినిమాగా చ‌రిత్ర సృష్టించింది. తొలి వీకెండ్ అమెరికాలో 235 మిలియ‌న్ డాల‌ర్లు కొల్ల‌గొట్టింది. అంటే ఇది దాదాపు 15,065 కోట్ల‌కు స‌మానం. ఇక ఫుల్ ర‌న్‌లో `స్టార్ వార్స్ – ది ఫోర్స్ అవేకెన్స్‌` (937 మిలియ‌న్ డాల‌ర్లు), `అవ‌తార్‌` (760 మిలియ‌న్ డాల‌ర్లు), బ్లాక్ పాంథ‌ర్ (681 మిలియ‌న్ డాల‌ర్లు) చిత్రాలు టాప్ 3 పొజిష‌న్‌లో నిలిచాయి. `అవెంజ‌ర్స్ 2` ఈ రికార్డుల్లో కొన్నిటిని స‌వ‌రించే ఆస్కారం ఉంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి.

User Comments