తొలి వీకెండ్‌ 2000 కోట్లు?

Last Updated on by

`అవెంజ‌ర్స్‌: ఇన్‌ఫినిటీ వార్‌` ఏప్రిల్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంకో రెండ్రోజులు ఉంద‌న‌గానే ఇప్ప‌టికే టిక్కెట్ విండో ఝామ్ అయిపోయింది. ఆన్‌లైన్ బుకింగుల్లో హౌస్‌ఫుల్ బోర్డ్ ద‌ర్శ‌న‌మిస్తోంది.  ఇండియా, తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈ సినిమాకి భారీ క్రేజు నెల‌కొన‌డంతో ఆన్‌లైన్‌లో టిక్కెట్లు దొర‌క‌డం క‌ష్టంగానే మారింది. తెలుగు వెర్ష‌న్‌లో థానోస్ పాత్ర‌కు రానా వాయిస్ ఇవ్వ‌డంతో ఇక్క‌డా క్యూరియాసిటీ పెరిగింది.
మార్వ‌ల్ సంస్థ నిర్మించిన ఈ సినిమా తొలి వీకెండ్, తొలి వారంలో రికార్డుల మోత మోగించ‌డం ఖాయ‌మ‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. తొలి వీకెండ్‌ అమెరికా బాక్సాఫీస్ నుంచి దాదాపు 1700 కోట్లు (250 మిలియ‌న్ డాల‌ర్లు) వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అలాగే ఇత‌ర‌త్రా చోట్ల క‌లుపుకోగా తొలి వీకెండ్‌లోనే 2000 కోట్లు వ‌సూలు చేసేందుకు ఛాన్సుంద‌ని ట్రేడ్‌ అంచ‌నా  వేస్తోంది. అమెరికాలో అత్య‌ధిక వ‌సూళ్లలో నంబ‌ర్ -1 చిత్రంగా `స్టార్ వార్స్- ది ఫోర్స్ ఎవేకెన్స్` చ‌రిత్ర సృష్టించింది. ఆ సినిమా 248 అమెరికా డాల‌ర్లు వ‌సూలు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును `అవెంజ‌ర్స్‌-ఇన్‌ఫినిటీ వార్‌` బ్రేక్ చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ సినిమాని మార్వ‌ల్ సంస్థ ఎంతో డేర్ చేసి తెర‌కెక్కించింద‌ని ఇప్ప‌టికే క్రిటిక్స్ ప్ర‌శంసిస్తున్నారు. ర‌స్సో బ్ర‌దర్శ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో థానోస్ పాత్ర‌లో జోస్ బ్రోలిన్ న‌టించారు. దాదాపు 2000 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా అంత‌కు ప‌దింత‌లు వ‌సూలు చేస్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

User Comments