అవేంజ‌ర్స్ దెబ్బ‌కు భరత్ బ‌లి

Last Updated on by

హాలీవుడ్ సినిమాలు మ‌న దేశంలో ఎవ‌రు చూస్తారులే.. చూసినా మ‌న సినిమాల‌కు పోటీ వ‌చ్చేంత రేంజ్ వాటికి ఎక్క‌డ ఉంది..? అంత సినిమా లేదు.. మ‌న స్టార్ హీరోల ముందు హాలీవుడ్ సినిమాలు దిగ‌దుడుపే అని ఇన్నాళ్లూ భావ‌న ఉండేది. అందులో నిజం కూడా లేక‌పోలేదు. ఎప్పుడో అవ‌తార్.. జంగిల్ బుక్.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ లాంటి సినిమాలు మాత్ర‌మే ఇండియాలో బాగా ఆడాయి. కానీ మిగిలిన సినిమాలన్నీ ఎప్పుడొచ్చి ఎప్పుడెళ్లాయో కూడా తెలియ‌లేదు. కానీ ఇప్పుడు అవేంజ‌ర్స్ మాత్రం అరాచ‌కంగా ఆడేస్తుంది. ఈ సినిమా దెబ్బ‌కు మ‌న సినిమాలు కూడా ఉనికి కోల్పోతున్నాయి. అస‌లు ఈ చిత్రం వ‌చ్చినా కూడా తెలుగులో భ‌ర‌త్ అనే నేను క‌లెక్ష‌న్ల‌పై దెబ్బ ప‌డ‌దని అనుకున్నారంతా. కానీ రెండో వారం అవేంజ‌ర్స్ ఊహించ‌ని విధంగా భ‌ర‌త్ కు భారీ షాక్ ఇవ్వ‌బోతుంది.

ఈ చిత్రం మ‌ల్టీప్లెక్సుల్లో సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ఒక‌టి రెండు కాదు.. తొలిరోజే ఇండియాలో ఏకంగా 40 కోట్ల భారీ ఓపెనింగ్ సాధించేసింది అవేంజ‌ర్స్. అస‌లు ఓ హాలీవుడ్ సినిమాకు ఇంత భారీ ఓపెనింగ్ రావ‌డం చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి. కేవ‌లం బుకింగ్స్ రూపంలోనే ఈ చిత్రం తొలిరోజు 22 కోట్లు వ‌సూలు చేసింది. ఈ లిస్ట్ లో బాహుబ‌లి 2 మాత్ర‌మే 37 కోట్ల‌తో ముందుంది. ఈ మూడు రోజులు అవేంజ‌ర్స్ ఊచ‌కోత ఖాయంగా క‌నిపిస్తుంది. మెట్రో సిటీస్ లో అవేంజ‌ర్స్ దెబ్బ‌తో తెలుగు, హిందీ సినిమాల‌కు కూడా దెబ్బ‌ప‌డ‌టం ఖాయం. మొత్తానికి హాలీవుడ్ యోధులు మ‌న బాక్సాఫీస్ ను కుమ్మేస్తున్నార‌న్న‌మాట‌.

User Comments