అవార్డ్ క‌ర్త‌ల్ని వెళ్ల‌గొట్టారు!

గ‌త కొంత‌కాలంగా ఇండీవుడ్ అవార్డ్స్ పేరుతో రామోజీ ఫిలింసిటీలో ర‌న్ చేస్తున్న అవార్డు వేడుక‌లు ఈసారి వెన్యూ మార‌డం ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కొచ్చింది. ప్ర‌తిసారీ తెలంగాణ ప్ర‌భుత్వ అండ‌దండ‌ల‌తో కేర‌ళ బిజినెస్‌మేన్ సోహ‌న్ రాయ్ ఇక్క‌డ అవార్డు వేడుక‌ల్ని నిర్వ‌హించేవారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అమ్మి బాగానే క్యాష్ చేసుకునేవార‌న్న ప్ర‌చారం ఉంది. అయితే ఈసారి ఈ ఈవెంట్ వెన్యూ మారింది. అంతేకాదు.. ఈసారి నిర్వ‌హిస్తున్న ఈవెంట్‌కి తేరాస అప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వం నుంచి స‌పోర్టు లేదుట‌. ఈ అవార్డులు ఏదో హ‌డావుడి చేయ‌డం త‌ప్ప ఇవేవీ జ‌నాల్ని అంత‌గా ప్ర‌భావితం చేసేవి కావ‌న్న మాటా వినిపిస్తోంది. డిసెంబ‌ర్ 1 నుంచి 5 వ‌ర‌కు ఐదు రోజుల‌పాటు ఇండీవుడ్ చ‌ల‌న చిత్రోత్స‌వాన్ని నిర్వ‌హించ‌నున్నారు. 50 దేశాల‌కు చెందిన చిత్రాల ప్ర‌ద‌ర్శ‌న వుంటుందిట‌. అయితే ఇండీవుడ్ అవార్డుల‌కు తెలుగు సినీమీడియా నుంచి ఎప్పుడూ సపోర్ట్ లేక‌పోవ‌డంపైనా ఆసక్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కీ సోహ‌న్ రాయ్‌కి తేరాస అధినేత‌ల‌తో చెడ‌డం వ‌ల్ల‌నే ఆయ‌న వెన్యూ మార్చి సొంతంగా నిర్వ‌హిస్తున్నారా? అంటూ ముచ్చ‌టా సాగుతోంది. ఈ అవార్డుల‌కు స్పాన్స‌ర్‌షిప్ ఎవ‌రు? అన్న‌దానిపైనా ఆరాలు సాగుతున్నాయి.