అ..! అదే ప‌రిస్థితి..

ఈ మ‌ధ్య కాలంలో ఓ సినిమా ఇంత‌గా ఏదీ ఆస‌క్తి పెంచ‌లేదు. ఎంత క్లిష్ట‌మైన క‌థ‌ల‌నైనా ఇట్టే ప‌సిగ‌ట్టే ప్రేక్ష‌కులు అ.. సినిమా క‌థ‌ను మాత్రం క‌నిపెట్ట‌లేక‌పోతున్నారు. అస‌లు క‌థ ఏంటో తెలియ‌కుండా అంతలా జాగ్రత్త పడ్డారు చిత్ర యూనిట్. నాని ఏం మాయ చేస్తున్నాడో తెలియ‌దు కానీ ఈ చిత్ర క‌థ‌పై మాత్రం చాలా అనుమానాలు.. ఆస‌క్తి.. అంచ‌నాలు మూడు ఉన్నాయి. పైగా ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో ఇలాంటి క‌థ‌తో సినిమా రాలేదంటూ ధైర్యంగా చెప్పాడు నాని. అలాంటి సినిమా నిర్మించాడు నాని. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్త‌యింది. యు బై ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. అక్క‌డ సెన్సార్ పూర్తైనా కూడా క‌థ గురించి చిన్న ఆచూకి కూడా బ‌య‌టికి రాలేదు. అయితే సినిమా మాత్రం ఖచ్చితంగా కొత్త‌గా ఉంద‌ని.. సెకండాఫ్ చాలా బాగా వ‌ర్క‌వుట్ అయింద‌ని చెబుతున్నారు. క్రైమ్.. కామెడీ.. రొమాన్స్.. ఇలా ఏ ఒక్క జోన‌ర్ కాకుండా అన్ని జోన‌ర్ లకు అ.. సెట్ అవుతుంద‌ని తెలుస్తుంది.

టీజ‌ర్.. ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత కూడా సినిమాలో ఏముందో అర్థం కాలేదు. అంతగా లాక్ చేసాడు ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వ‌ర్మ‌. అన్ని లుక్కుల చూపించినా కూడా క‌థ మాత్రం రివీల్ చేయ‌లేదు నాని. ఇందులో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీతో పాటు ల‌వ్, కామెడీ, క్రైమ్ అన్నీ క‌నిపిస్తున్నాయి. ఓ సినిమాలో న‌వ‌ర‌సాలు అంటారు క‌దా అన్నీ ఉన్నాయి ఇందులో. అంతేకాదు.. చేప‌ల‌కు కూడా క‌న్నీళ్లుంటాయి బాస్.. కాక‌పోతే క‌న‌బ‌డ‌వు నీళ్ల‌లో ఉంటాయి క‌దా అనే డైలాగ్ అద్భుతంగా పేలింది. ఈ చిత్రంలో కాజ‌ల్.. నిత్యామీన‌న్.. ఇషారెబ్బా.. అవ‌స‌రాల శ్రీ‌నివాస్.. ప్రియ‌ద‌ర్శి లాంటి వాళ్లంతా న‌టిస్తున్నారు. ఇక ర‌వితేజ చెట్టుగా.. నాని చేప‌గా న‌టిస్తున్నారు ఇందులో. ఫిబ్ర‌వ‌రి 16న సినిమా విడుద‌ల కానుంది. ఆ ముందు రోజు రాత్రినుంచే యుఎస్ ప్రీమియ‌ర్లు కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రి.. అ.. విడుద‌లైన త‌ర్వాత ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతుందో..?