అ.. అమ్మో ఏంటి క‌లెక్ష‌న్లు..?

Last Updated on by

అ.. ఈ టైటిల్ అనౌన్స్ చేసిన‌పుడే చెప్పాడు నాని. క‌చ్చితంగా సినిమా చూసిన త‌ర్వాత మీరు ఆశ్చ‌ర్య‌పోతార‌ని. ఇప్పుడు ఈ సినిమా క‌లెక్ష‌న్లు చూసిన త‌ర్వాత కూడా అ.. అనాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. తొలిరోజు వ‌చ్చిన టాక్ కు ఇప్పుడు సినిమాకు వ‌స్తోన్న వ‌సూళ్ల‌కు ఎక్క‌డా పొంత‌న క‌నిపించ‌డం లేదు. అర్థం కాలేద‌న్నారు.. అర్థ‌మే లేద‌ని కొంద‌ర‌న్నారు.. అస‌లు ఇలాంటి సినిమాలు ఎవ‌రు చూస్తారు అని ఇంకొంద‌రు అన్నారు. కానీ అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ అ.. క‌లెక్ష‌న్ల వేట‌లో దూసుకెళ్తుంది. మ‌ల్టీప్లెక్స్ ల‌లో అయితే ఈ సినిమా దూకుడు మామూలుగా లేదు. సింగిల్ స్క్రీన్స్ లో నిజంగానే సినిమా అర్థం కాన‌ట్లుంది అందుకే ఇక్క‌డ క‌లెక్ష‌న్లు పెద్ద‌గా రావ‌ట్లేదు. అ.. చిత్రం నాలుగు రోజుల్లోనే 12 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. షేర్ కూడా 5.3 కోట్ల‌కు చేరువ‌గా ఉంది.

ఈ చిత్రాన్ని 6 కోట్ల‌కు బిజినెస్ చేసాడు నాని. అంటే మరొక్క అర‌కోటి వ‌స్తే చాలు..! ఇప్పుడు అ.. దూకుడు చూస్తుంటే మ‌రో 4 కోట్లు ఈజీగా తీసుకొచ్చేలా ఉంది. ఓవ‌ర్సీస్ లో అయితే అ.. కు బాగానే ప‌డిపోతున్నారు ప్రేక్ష‌కులు. అక్క‌డ కొత్త క‌థ‌ల‌కు ప‌డిపోతార‌ని తెలుసు కానీ మ‌రీ ఇంత బాగా ప‌డిపోతార‌ని తెలియ‌దు. అక్క‌డ చిన్న‌సైజ్ అరాచ‌కాలే చేస్తుంది ఈ సినిమా. ఇప్ప‌టికే హాఫ్ మిలియ‌న్ దాటేసి.. 7 ల‌క్ష‌ల డాల‌ర్ల వైపు ప‌రుగులు తీస్తుంది అ..! అక్క‌డ చేసిన బిజినెస్ తో పోలిస్తే ఈజీగా ట్రిపుల్ మ‌ని వెన‌క్కి వ‌చ్చేస్తుంది. దాన్ని బ‌ట్టి ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అనేది అర్థం చేసుకోవ‌చ్చు. మొత్తానికి హీరోగానే కాదు.. నిర్మాత‌గా కూడా నాని హిట్ కొట్టాడన్న‌మాట‌.

User Comments