నాగ్ హీరోయిన్ భర్తకు బెదిరింపులు

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సరసన ‘సూపర్’ సినిమాలో రెచ్చిపోయి నటించిన అందాల భామ అయేషా టాకియా గుర్తుండే ఉంటుంది. అప్పట్లో కుర్రకారును గుచ్చి గుచ్చి చంపిన ఈ హాట్ బ్యూటీ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండటంతో ఈ మధ్య వార్తల్లో పెద్దగా లేకుండా పోయింది. అయితే, ఇప్పుడు షాకింగ్ గా అయేషా టాకియా భర్తకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో అమ్మడు ఒక్కసారిగా న్యూస్ లో హైలైట్ అయింది. అసలు విషయంలోకి వెళితే, 2009లో సమాజ్ వాదీ పార్టీ నేత అబూ అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మీని అయేషా టాకియా ప్రేమ వివాహం చేసుకుందని సమాచారం. ఇక ఈ జంటకు మిఖేయిల్ అనే కుమారుడు కూడా ఉండటం విశేషం.
ఇదిలా ఉంటే, రీసెంట్ గా గుర్తు తెలియని వ్యక్తులు.. అయేషా టాకియా ఓ హిందువు అని, లవ్ జిహాదీ లో భాగంగానే ఆమెను వివాహం చేసుకున్నావని, త్వరలోనే మీ కుంటుంబం మొత్తాన్ని హత్య చేస్తామని ఫర్హాన్ అజ్మీని ఫోన్ లో బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయమై ఫర్హాన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తాజాగా మీడియాకు న్యూస్ వచ్చింది. ఈ సందర్బంగా ఫిర్యాదులో.. మీరంతా జంతువులు, లవ్ జీహాద్ పేరిట మీరు ఓ హిందువు మహిళను వివాహం చేసుకున్న విషయాన్ని మర్చిపోయారా? త్వరలోనే మీ కుటుంబాన్ని చంపేస్తాం, బాంబులు పెట్టి మరీ ఈ పనిచేస్తాం’ అని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాకుండా హిందూ సేనకు సంబంధించిన వాళ్ళే ఈ పని చేశారని కూడా ఆరోపించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించినట్లు చెబుతున్నారు. మరి ఇప్పుడు ఈ షాకింగ్ సంఘటనపై అయేషా టాకియా ఎలా స్పందిస్తుందో చూడాలి.