బి.ఏ.రాజుకు దాస‌రి పుర‌స్కారం

Last Updated on by

సినిమా స‌క్సెస్‌కి ప్ర‌చారం ఎంతో కీల‌కం. ప్ర‌మోష‌న్ లేనిదే అస‌లు ఏదీ లేదు. అందుకే అత్య ంత కీల‌క‌మైన మీడియాతో స్నేహ‌శీలిగా ఉంటూ సినిమాకి కావాల్సిన ప్ర‌చారం చేయ‌గ‌లిగే నేర్ప‌రిని ద‌ర్శ‌క‌,నిర్మాత‌లు పీఆర్‌వోగా ఎంపిక చేసుకుంటారు. 85ఏళ్ల అసాధార‌ణ చ‌రిత్ర క‌లిగిన టాలీవుడ్‌లో ఆ విభాగంలో ఎన‌లేని కృషి చేసి, అన‌న్య‌సామాన్య‌మైన విజ‌యాల‌కు కార‌కుడై.. ఎంద‌రికో స్ఫూర్తినిస్తూ.. అంద‌రికీ ఆప్తుడిగా కొన‌సాగుతున్న మేటి జ‌ర్న‌లిస్ట్ కం పీఆర్‌వో బి.ఏ.రాజు ప్ర‌స్థానం ఎంతో విశిష్ఠ‌మైన‌ది. దాదాపు 1500 పైగా సినిమాల‌కు పీఆర్‌వోగా ప‌ని చేశారు ఆయ‌న‌. ఈ రంగంలో అంత పెద్ద ట్రాక్ రికార్డ్ ఉన్న వేరొక పీఆర్‌వో లేనేలేరంటే అతిశ‌యోక్తి కాదు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా, ప్ర‌తిష్ఠాత్మ‌క `సూప‌ర్‌హిట్‌` మ్యాగ‌జైన్ అధినేత‌గా బి.ఏ.రాజు ప్ర‌స్థానం ఎంతో గొప్ప‌ది. మ‌ద్రాసు నుంచి ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ వ‌చ్చి 200 కోట్ల క్ల‌బ్ అంత‌కుమించిన మార్కెట్‌ని అందుకుంది. ఇంత పెద్ద ప‌రిశ్ర‌మ‌లో అసాధార‌ణ‌మైన ట్రాక్ రికార్డును ఆయ‌న అందుకున్నారు. ప‌రిశ్ర‌మ‌లో సాధించిన అసాధార‌ణ‌ ట్రాక్ రికార్డు ప‌రంగా ఆయ‌న పేరు గిన్నిస్ బుక్‌కి ఎక్కాల్సిందే. కానీ అందుకు అంత‌గా ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌రు. ఏదైతేనేం..  ఆయ‌న‌ను సువిశాల‌మైన సినీప‌రిశ్ర‌మ, అభిమాన ప్ర‌పంచం గుర్తించి గౌర‌విస్తోంది. రాజుగారిని ప్ర‌త్యేకించి స‌త్క‌రించుకునేందుకు ఓ అద్భుత‌మైన‌ వేదిక సిద్ధం చేస్తోంది.
ద‌ర్శ‌క‌ర‌త్న‌, డా. దాస‌రి నారాయ‌ణ‌రావు తొలి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని..ప‌రిశ్ర‌మ‌ సంబ‌రాలు చేసుకుంటున్న వేళ‌.. ఓ ప్ర‌త్యేక వేదిక‌పై దాసరి జీవన సాఫల్య పురస్కారాన్ని సూపర్‌హిట్‌ సినీ వారపత్రిక ఎడిటర్‌ అండ్‌ పబ్లిషర్‌, సూపర్‌హిట్‌ చితాల్ర పి.ఆర్‌.ఓ, ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు అందుకోనున్నారు. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సేవలందిస్తున్న ఫిలిం ఎనాలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ(ఫాస్‌) – దాసరి 2018 ఫిలిం అవార్డులను మే 6న హైదరాబాద్‌లోని శ్రీత్యాగరాయ గానసభ వేదికగా ప్రదానం చేయనున్నారు. బి.ఏ.రాజు స‌హా మేటి ద‌ర్శ‌కులు కోడి రామ‌కృష్ణ‌, శేఖ‌ర్ క‌మ్ముల‌, సుద్ధాల అశోక్‌తేజ‌, మ‌ధుప్రియ‌, వ‌డ్డేప‌ల్లి కృష్ణ‌, సంపూర్ణేష్‌బాబు, శివపార్వతి, సంగీత దర్శకులు వాసూరావు, మాటల రచయిత సంజీవి, లయన్‌ డా. ఎ.నటరాజు త‌దిత‌రులకు పుర‌స్కారాలు అందించ‌నున్నారు. ఈ వేదిక‌ను  లేడీ డైరెక్టర్ జయ.బి ప్రారంభిస్తారు.

User Comments