అప్పుడు బాహుబ‌లి.. ఇప్పుడు అవేంజర్స్..

Last Updated on by

అవేంజ‌ర్స్.. ప్ర‌పంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న సినిమా ఇది. కేవ‌లం ఐదంటే ఐదు రోజుల్లోనే దాదాపు 3000 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రికార్డుల‌న్నింటినీ తుడిచేస్తూ.. స‌రికొత్త చ‌రిత్ర వైపు ప‌రుగులు తీస్తుంది అవేంజ‌ర్స్. ఇక ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కూడా ఈ చిత్ర మ్యాజిక్ ఇలాగే సాగుతుంది. సాధార‌ణంగా బాలీవుడ్ లో సూప‌ర్ స్టార్స్ కు కూడా ద‌క్క‌ని విధంగా ఈ చిత్రానికి వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం సాగుతుంది. ఒక‌టి రెండు కాదు.. ఐదు రోజుల్లోనే 173 కోట్లు వ‌సూలు చేసింది. నెట్ కూడా 135 కోట్లు ఉంది. తొలిరోజు 31.. రెండో రోజు 30.. మూడో రోజు 32.. నాలుగో రోజు 20.56.. ఐదో రోజు 20.41 కోట్లు వ‌సూలు చేసింది. అంటే రోజుకు క‌నీసం 20 కోట్లకు త‌గ్గ‌కుండా వ‌సూళ్లు వ‌స్తున్నాయి.

బాలీవుడ్ లో సూప‌ర్ స్టార్స్ కు కూడా సాధ్యం కాని రికార్డ్ ఇది. ఎంత‌పెద్ద సినిమా అయినా వీక్ డేస్ లో వీక్ అవుతుంది. కానీ అవేంజ‌ర్స్ మాత్రం దానికి విరుధ్దంగా వెళ్తుంది. అప్ప‌ట్లో బాహుబ‌లి 2కి మాత్ర‌మే ఈ రికార్డ్ సాధ్య‌మైంది. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు అవేంజ‌ర్స్ అదే దూకుడు చూపిస్తుంది. ఈ చిత్రం దూకుడు చూస్తుంటే కేవ‌లం ఇండియాలోనే 250 కోట్లు వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది. అన్న‌ట్లు ఇప్ప‌టికీ మ‌ల్టీప్లెక్సుల్లో టికెట్స్ దొర‌క‌డం లేదు ఈ చిత్రానికి. దాన్నిబ‌ట్టి అర్థమైపోతుంది అవేంజ‌ర్స్ ర‌చ్చ ఎలా ఉందో..?


Related Posts