బాహుబ‌లి-3 సీక్రెట్‌గా?

Last Updated on by

ఊహాతీతం అనిపించే ప్ర‌య‌త్నం చేస్తేనే అద్భుత ఫ‌లితం ద‌క్కించుకోవ‌డం సాధ్యం. అది బాహుబ‌లి1, బాహుబ‌లి 2 చిత్రాల‌తో ప్రూవైంది. అస‌లు ఆ సిరీస్ ప్రారంభించిన కాన్వాసు వేరు, ఆ త‌ర్వాత సెట్స్‌కెళ్లేప్ప‌టికి జ‌రిగిందంతా వేరు. ఊహాతీతంగా ప్ర‌తిదీ కుదిరాయి. ఆ ప్ర‌య‌త్నం పెద్ద స‌క్సెసైంది. అందుకే ఇక మీద‌ట కూడా రాజ‌మౌళి ఏం చేసినా అలానే ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇన్నాళ్లు జ‌క్క‌న్న తాను చేయ‌బోతున్న తదుప‌రి సినిమా గురించి ఎలాంటి లీకులు రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. తార‌క్‌, రామ్‌చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్ ఓ రెగ్యుల‌ర్ యాక్ష‌న్ సినిమా అని ఇద్ద‌రూ అన్న‌ద‌మ్ములుగా న‌టిస్తార‌ని ప్ర‌చారం సాగింది.

అయితే జ‌నాలు ఊహించ‌ని ట్విస్టేదో సెట్స్‌కెళ్లే ముందే జ‌క్క‌న్న ఇస్తాడ‌న్న కొత్త మాటా వినిపిస్తోందిప్పుడు. జ‌క్క‌న్న మైండ్‌లో ఇంకా బాహుబ‌లి సిరీస్ అలానే ఉంది. ఆ రెండు భాగాల త‌ర్వాత కొన‌సాగింపు తీసే ఆలోచ‌న అయితే స‌జీవంగానే ఉంది. ఆ క్ర‌మంలోనే విజ‌యేంద్ర ప్ర‌సాద్ బాహుబ‌లి స్థాయిలో ఉండే వేరొక స్క్రిప్టుని వినిపించాడు. అయితే చివ‌రి నిమిషంలో మ‌న‌సు మార్చుకున్న రాజ‌మౌళి ఓ థ్రిల్ల‌ర్ కాన్సెప్టుకి ఓకే చెప్పాడు. అంటే బాహుబ‌లి 3 తెర‌కెక్కే ఛాన్స్‌ని కాద‌ని అన‌లేం. అలాగ‌ని ఇప్ప‌టికిప్పుడే అది సెట్స్‌కెళ్ల‌క‌పోవ‌చ్చు. ప్ర‌ఖ్యాత బాలీవుడ్ వెబ్ స‌మాచారం ప్ర‌కారం.. మిడ్ డే అందించిన క‌థ‌నంలో అలాంటి ఓ సీక్రెట్ దాగి ఉంద‌ని ప్ర‌చారం సాగించింది. ఇక‌పోతే బాహుబ‌లి త‌ర‌హా ఆ చిత్రం ప్ర‌స్తుతానికి హోల్డ్‌లో ఉంది అంతే. మ‌రోవైపు విజ‌యేంద్ర ప్ర‌సాద్ వెబ్‌సిరీస్‌, టెలీ సిరీస్ అంటూ మ‌రో10 క‌థ‌లు రాసుకుని వాటితో 10 మంది ద‌ర్శ‌కుల్ని ప‌రిచ‌యం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఆ ఇద్ద‌రి నుంచి స‌రైన స‌మాచారం ఏదీ లీక్ కాలేదు ఇప్ప‌టికి. ఇప్ప‌టికి బాహుబ‌లి త‌ర‌హాలో వేరొక‌ స్క్రిప్టు ఒక‌టి విజేంద్ర ప్ర‌సాద్ రాజ‌మౌళికి వినిపించారంటూ ఉత్త‌రాదిన ప్ర‌చారం హోరెత్తిపోతోంది. గ్రాండ్ స్కేల్‌తో .. భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా ఉంటుంద‌ని మోతెక్కిపోతోంది.

User Comments