‘బాహుబలి’ బ్యూటీ, చెంప చెళ్లుమనిపించింది..!

బాహుబలి ది బిగినింగ్ లో ప్రభాస్ పక్కన స్పెషల్ సాంగ్ లో మెరిసిన హాట్ బ్యూటీ స్కార్లెట్ విల్సన్ గుర్తుండే ఉంటుంది.

ముఖ్యంగా కెమెరామెన్ గంగతో రాంబాబు, ఎవడు లాంటి సినిమాల్లో కూడా ఐటమ్ సాంగ్స్ చేసిన ఈ బ్రిటిష్ బ్యూటీని అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు.

అలాంటి ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం ఓ హిందీ సినిమాలో నటిస్తూ.. తాజాగా షూటింగ్ సందర్బంగా ఓ నటుడి చెంప చెళ్లుమనిపించడం ఇప్పుడు బీటౌన్ లో హాట్ న్యూస్ గా మారింది.

అసలు విషయంలోకి వెళితే, బాలీవుడ్ లో ‘హంసా : ఏక్ సంయోగ్’ అనే సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి స్కార్లెట్ ఓకే చెప్పిందట.

ఈ నేపథ్యంలో షూటింగ్ స్పాట్ కు వెళితే, అక్కడ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ఉమాకాంత్ రాయ్ అనే నటుడు ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడట.

ఈ క్రమంలో అసభ్యంగా సంజ్ఞలు చేయడమే కాకుండా, స్కార్లెట్ ను ఇబ్బందికర రీతిలో టచ్ చేసే ప్రయత్నం కూడా చేశాడట.

దీంతో విసుగు చెంది సహనం కోల్పోయిన స్కార్లెట్ తాజాగా సెట్ లోనే అందరూ చూస్తుండగా.. అతడిని చెంప దెబ్బ కొట్టి తగిన విధంగా బుద్ధి చెప్పింది.

దీంతో అక్కడే ఉన్న యూనిట్ సభ్యులు కూడా విషయాన్ని వెంటనే అర్థం చేసుకోవడంతో.. అంతగా పాపులర్ కాని ఆ నటుడికి దేహశుద్ధి చేసి, సినిమా నుంచి బయటకు పంపించేసినట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఉమాకాంత్ రాయ్ అనే ఆ నటుడిపై ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు కూడా చేసినట్లు చెప్పుకొచ్చారు.

ఈ సందర్బంగా స్కార్లెట్ కు అతను బేషరతుగా క్షమాపణలు చెప్పని పక్షంలో నటుడిగా అతని లైసెన్స్ కూడా రద్దు చేయాలంటూ ఫిర్యాదు చేస్తామని చిత్ర నిర్మాత పేర్కొనడం గమనార్హం. అయితే, ఈ వ్యవహారంపై ఇప్పటివరకు హాట్ బ్యూటీ స్కార్లెట్ విల్సన్ మాత్రం ఏ విధంగానూ స్పందించకపోవడం విశేషం.

చుడండి: బాహుబలి’ బ్యూటీ, చెంప ఎలా చెళ్లుమనిపించిందో!

Follow US