టిప్ప‌ర్ లారీ ఎళ్లి చైనాని గుద్దేసింది

Last Updated on by

ఖాన్‌లు వెన‌క్కి వెళ్లాలి. త‌ట్టా బుట్టా స‌ర్ధుకోవాలి. ఇంకా ఇంకా మేమే బాద్షాలం అంటే కుద‌ర‌ద‌రిక‌. మ‌న ప్ర‌భాస్ ముందు ఎవ‌రైన దిగ‌దుడుపే. ఇప్పుడు ఆ రేంజు!  డార్లింగ్ లోకల్ అని తీసిపారేయొద్దు.. డార్లింగ్ నేష‌న‌ల్‌.. ఇంట‌ర్నేష‌న‌ల్‌. అత‌డు ఎందెందు అడుగుపెట్టినా అందందు త‌డాఖా చూపిస్తాడు. తాట తీస్తాడు! ప్ర‌స్తుతం మ‌న ప్ర‌భాస్ సాధిస్తున్న ఘ‌న‌త అలానే ఉంది మ‌రి. ఇంత‌కీ ప్ర‌భాస్‌ ఏం చేశాడేంటి?
ఇన్నాళ్లు తెలుగు సినిమా లోక‌ల్ అనే అనుకున్నాం. ఆ హ‌ద్దును చెరిపేశారిప్పుడు. ప్ర‌భాస్ – రాజ‌మౌళి బృందం అసాధార‌ణ జైత్ర యాత్ర స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. జ‌క్క‌న్న‌, ప్ర‌భాస్ బృందంతో క‌ల‌సి ఆర్కా మీడియా అసాధార‌ణ వ్యూహాత్మ‌క యాత్ర కేవ‌లం లోక‌ల్ మార్కెట్‌నే కాదు, ప్ర‌పంచ‌దేశాల మార్కెట్ల‌ను కొల్ల‌గొడుతోంది. ఇండియా, జ‌పాన్‌ మాత్ర‌మే కాదు.. చైనాలోనూ గెలుపు రుచి చూపిస్తున్నారు. బాహుబ‌లి 1 చైనాలో ఆశించిన విజయం సాధించ‌క‌పోవ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన ఈ బృందం బాహుబ‌లి 2 ని ఎంతో తెలివిగా చైనాలో రిలీజ్ చేసింది.
చైనాలో బాహుబ‌లి 2 చిత్రం స‌ల్మాన్ భాయ్ న‌టించిన `భ‌జ‌రంగి భాయిజాన్‌`ని మించి  వ‌సూలు చేసింది. భాయ్‌ని రేసులో వెన‌క్కి నెట్టాడు ప్ర‌భాస్‌. ప్ర‌భాస్ కంటే ముందు ఓపెనింగ్ వ‌సూళ్ల‌లో సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌, హిందీ మీడియం చిత్రాలు ఉన్నా.. ప్ర‌భాస్ మాత్రం ఆ స్థాయికి ద‌గ్గ‌ర‌గా చేరాడు. 2018లో ఇండియా నుంచి వెళ్లి చైనాలో రిలీజైన సినిమాల్లో టాప్ 3 పొజిష‌న్‌లో నిలిచింది. శుక్ర‌వారం ఏకంగా 17 కోట్లు(2.43 మిలియ‌న్ డాల‌ర్లు) వ‌సూలు చేసింది. ఇది అన‌న్య సామాన్య ం .. అద్భుతం. ప్రాంతీయ సినిమాల మార్కెట్‌కి ఇప్పుడు అంత‌ర్జాతీయ మార్కెట్ ద‌న్నుగా నిల‌వ‌బోతోందన్న సంకేతంగానే భావించాలి. ఇదే ఉత్సాహంలో త‌దుప‌రి రానున్న మెగాస్టార్ చిరంజీవి `సైరా`, వ‌రుణ్‌తేజ్ స్పేస్ మూవీ.. ఆ స్థాయికి చేరాల‌నే ఆకాంక్షిద్దాం.

User Comments