బాహుబ‌లి ఇంకా సంపాదిస్తూనే ఉంది

Last Updated on by

ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. రాజ‌మౌళి కెరీర్ ను మార్చేసింది. ఇకపై ఆయ‌న ఎన్ని సినిమాలు చేసినా కూడా బాహుబ‌లిని మాత్రం దాటేస్తుందో లేదో మ‌రి. మ‌ళ్లీ అలాంటి సినిమా చేయ‌డానికి రాజ‌మౌళికి కూడా ధైర్యం స‌రిపోతుందో లేదో..! బాహుబ‌లి లాంటి అద్భుతం కెరీర్ లో ఒక్క‌సారే జ‌రుగుతుంది. అది జ‌రిగిపోయింది. ఆ అద్భుతం పూర్తై కూడా ఏడాది అయిపోయింది. అయినా ఇప్ప‌టికీ వ‌సూళ్లు వ‌స్తూనే ఉన్నాయి. ద‌ర్శ‌క‌ధీరుడి విజువ‌ల్ వండ‌ర్ కు.. ఆయ‌న బుర్ర‌లో మెదిలిన మాహిష్మ‌తీ సామ్రాజ్యానికి ఇప్ప‌టికీ చప్ప‌ట్ల‌తో పాటు కోట్లు కూడా వ‌చ్చి ప‌డుతూనే ఉన్నాయి.

ఈ మధ్యే బాహుబ‌లి 2 జపాన్ లో విడుద‌లైంది. అక్క‌డ ఈ చిత్రం మంచి వ‌సూళ్లు సాధిస్తుంది. ఇప్ప‌టికే అక్క‌డే 4 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఓ తెలుగు చిత్రానికి ఇన్ని వ‌సూళ్లు రావ‌డం ఇదే తొలిసారి. అన్న‌ట్లు జ‌పాన్ లో బాహుబ‌లి పార్ట్ 1 ఫ్లాప్ అయింది. కానీ రెండో భాగాన్ని మాత్రం జ‌ప‌నీయులు చూస్తున్నారు. దానికితోడు ఇప్ప‌టికీ బాహుబ‌లిని వ‌ద‌ల‌డం లేదు రాజ‌మౌళి. ఇంట‌ర్నేష‌నల్ వ‌ర్ష‌న్ ఒక‌టి రెడీ చేయాల‌ని చూస్తున్నాడు. పాట‌ల్లేకుండా కొన్ని సీన్లు ఎడిట్ చేసి ఇంగ్లీష్ వ‌ర్ష‌న్ కోసం సిద్ధం చేసుకుంటున్నాడు. మ‌రి ఇది విడుద‌ల చేసిన త‌ర్వాత క‌లెక్ష‌న్లు ఇంకెలా ఉండ‌బోతున్నాయో..? ఇప్ప‌టికే రెండు భాగాలు క‌లిపి దాదాపు 3000 కోట్లు వ‌సూలు చేసాయి. ఇలాంటి అద్భుతం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో మ‌ళ్లీ చూస్తామో లేదో..?

User Comments