బాహుబ‌లి బిఫోర్ ది బిగినింగ్‌

Last Updated on by

వెండితెర‌పై `బాహుబ‌లి` సిరీస్ ఎంత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌రో, అంత‌కుమించి ఇత‌ర‌త్రా మాధ్య‌మాల్లోనూ ఈ సిరీస్ ఉత్ప‌న్నాలు అంతే పెద్ద హిట్ట‌వుతున్నాయి. ఇదివ‌ర‌కూ బాహుబ‌లి కామిక్ బుక్ సిరీస్ పేరుతో అసాధార‌ణ‌ బిజినెస్ చేశారు. ఇప్పుడు ఏకంగా ఈ సినిమాలోని శివ‌గామి పాత్ర‌ను క‌మ‌ర్షియ‌లైజ్ చేసి `బాహుబ‌లి బిఫోర్ ది బిగినింగ్` పేరుతో వెబ్ సిరీస్‌నే రూపొందిస్తున్నారు. ఇందులో అస‌లు శివ‌గామి పాత్ర ఏమిటి? అమ‌రేంద్ర బాహుబ‌లి, భ‌ళ్లాల దేవల‌ను తీర్చిదిద్ద‌డంలో శివ‌గామి చేసిందేమిటి? వ‌ంటి ఎన్నో విష‌యాల్ని ప్రీక్వెల్ స్టోరీగా చూపించ‌బోతున్నారు. ప్ర‌స్థానం ఫేం దేవ‌క‌ట్టా ఈ వెబ్ సిరీస్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

త‌మిళ‌ర‌చ‌యిత ఆనంద్ నీల‌కంట‌న్ ర‌చ‌న `ది రైజ్ ఆఫ్ శివ‌గామి` ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ని రూపొందిస్తున్నారు. అందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఇక షూటింగ్ ప్రారంభోత్స‌వం గురించి మ‌రింత స‌మాచారం రానుంది. అలానే ఇందులో ఏ పాత్ర‌లో ఎవ‌రు న‌టించ‌నున్నారో వివ‌రాలు తెలియాల్సి ఉందింకా. ఈ వెబ్‌సిరీస్ ఎనౌన్స్‌మెంట్ ప్ర‌క‌ట‌న టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. దీనిని ప్ర‌ఖ్యాత ఆన్‌లైన్ స్ట్రీమింగ్ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ లైవ్ చేయ‌నుంది.

User Comments