బాహుబ‌లి రైట‌ర్ సీక్వెల్ క‌థ కోసమేనా?

Last Updated on by

స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ `విక్ర‌మార్కుడు` సీక్వెల్ క‌థ‌పై క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టారా? మ‌ళ్లీ చంబ‌ల్ లో తిష్ట వేసారా?  `విక్ర‌మార్కుడు`ని త‌ల‌ద‌న్నే క‌థను సిద్ధం  చేస్తున్నారా? అంటే అవున‌నే చెబుతున్నారు. మాస్ రాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `విక్ర‌మార్కుడు` ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. ఆ సినిమా కు సీక్వెల్  చేయాల‌న్న  ఆలోచ‌న విజ‌యేంద్ర ప్ర‌సాద్ లో కొన్నేళ్ల నుంచి ఉండ‌నే ఉంది. తాజాగా అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం ఆయ‌న ఆ ప‌నుల్లోనే బిజీగా ఉన్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని చంబల్ లో క‌థ రాసే ప‌నిలో బిజీగా ఉన్నార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఆయ‌న హైద‌రాబాద్ లో ఉంటే రోజూ సాయంత్రం మ‌ణికొండ  మెయిన్ రోడ్డులో గల `దిబ్బ‌రొట్టె` రెస్టారెంట్ కు వ‌చ్చేవారు. ఆ రెస్టారెంట్ ఆయ‌న  బంధువుల‌దే. అయితే నెల రోజులుగా ఆ రెస్టారెంట్ లో క‌నిపించలేద‌ట‌! ఆరా తీయ‌గా విజ‌యేంద్ర ప్ర‌సాద్ చంబ‌ల్ ప్రాంతంలో ఉన్నట్లు ఆయ‌న స‌న్నిహితుల చెప్పారు. చంబ‌ల్ అంటే గుర్తొచ్చేది విక్ర‌మార్కుడు సినిమానే కాబ‌ట్టి!  సీక్వెల్ క‌థ కోసం వెళ్లారా? అని సూటిగా ప్రశ్నించ‌గా అబ్బే అలాంటిదేమి లేదు…క్యాజువ‌ల్ గానే వెళ్లార‌ని న‌వ్వేసారు. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో విక్ర‌మార్కుడు సీక్వెల్ పై స్పెక్యులేష‌న్స్ మొద‌ల‌య్యాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఆ వార్త కు మ‌రింత బ‌లం చూకూరింది.  మ‌రి ఇందులో నిజ‌మెంత అన్న‌ది  స్టార్ రైట‌ర్స్ స్పందిస్తే గానీ క్లారిటీ రాదు.