బాలయ్య అడ్వాన్స్ బుకింగ్

Last Updated on by

ఎంత సంక్రాంతికి వ‌ర‌స విజ‌యాలు వ‌స్తే మాత్రం అన్ని సార్లు పండ‌గ‌ను తానే తీసుకుంటాడా..? ఏమో ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. బాల‌కృష్ణ మ‌రో సారి సంక్రాంతి రిలీజ్ డేట్ క‌న్ఫ‌ర్మ్ చేసాడు. ఆయ‌న చెప్పాడంటే వ‌స్తాడు. చెప్ప‌క‌పోతే అస్స‌లు అటువైపు కూడా చూడ‌డు. ఇప్పుడు ఈయ‌న క‌మిట్ అయిన ఎన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్ జులై నుంచి మొద‌లు కానుంది. తేజ దీనికి ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే ఈ చిత్ర ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. బాల‌య్య సినిమా లోపు వెంక‌టేష్ తోనూ ఓ సినిమా చేయ‌బోతున్నాడు తేజ‌. ఇది కేవ‌లం రెండు నెల‌ల్లోనే పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక జులై నుంచి ఎన్టీఆర్ బ‌యోపిక్ పై దృష్టి పెట్ట‌నున్నాడు.

ఇప్ప‌టికే తేజ‌కు ఎన్టీఆర్ స‌న్నిహితుల‌తో మీటింగ్స్ ఏర్పాటు చేసాడు బాల‌య్య‌. తాను కూడా తండ్రికి కావాల్సిన వాళ్ల ద‌గ్గ‌రికి వెళ్లి ఆయ‌న గురించి త‌న‌కు కూడా తెలియ‌ని ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌ను పోగు చేస్తున్నాడు. వీట‌న్నింటికీ తెర‌రూపం ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో వివాదాలేం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తుంది. ఇది కొడుకు ఓ తండ్రికి ఇచ్చే ఘ‌న‌మైన నివాళిగా భావిస్తున్నారు అభిమానులు. బాల‌య్య కూడా అంతే. ఎన్టీఆర్ జీవితాన్ని చూపించ‌డం అంటే ఆయన చీక‌టిని కాదు.. వెలుగును మాత్ర‌మే ప్రేక్ష‌కుల‌కు చూపించ‌డం అంటున్నాడు. ఈ సినిమాను జులైలో మొద‌లుపెట్టి.. జ‌న‌వ‌రి 10, 2019న విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. 2017కి గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి.. 2018కి జై సింహా.. ఇప్పుడు 2019కి ఎన్టీఆర్ బ‌యోపిక్.. మొత్తానికి పండ‌గ‌ను మ‌రో హీరోకు కూడా వ‌దిలేలా లేడుగా మ‌న బాల‌య్య‌.

User Comments