బాల‌య్య‌- బోయ‌పాటి బ‌డ్జెట్ క‌హానీ

Last Updated on by

బాల‌కృష్ణ – బోయ‌పాటి కాంబినేష‌న్ అన‌గానే సింహా, లెజెండ్ చిత్రాలు గుర్తుకు వ‌స్తాయి. ఆ రెండు సినిమాల‌కు ఆ ఇద్ద‌రూ సింక్ అయ్యి ప‌ని చేసిన తీరు తెర‌పై క‌నిపిస్తుంది. బాల‌య్య పంచ్ లు, యాక్ష‌న్‌ రేంజుకు బోయ‌పాటి పించ్ హిట్టింగ్ స్టైల్ స‌రితూగుతుంది. అందుకే మాస్ లో ఆ ఇద్ద‌రి క‌ల‌యిక ట్రెండ్ సెట్ట‌ర్ అని డిక్లేర్ చేసింది ట్రేడ్. అయితే బోయ‌పాటితో బాల‌య్య త‌ప్ప ఇంకొక‌ హీరో ఎవ‌రూ తూగ‌లేర‌ని ఇటీవ‌ల `విన‌య విధేయ రామ` ఫ‌లితం ఖ‌రాకండిగా తేల్చి చెప్పింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ ఫ‌లితం అందుకోవ‌డం, అటుపై వివాదాల గురించి తెలిసిందే.

ఓవైపు విధేయ రామ ఫ‌లితం గురించి చ‌ర్చ సాగుతుండ‌గానే .. బోయ‌పాటి త‌దుప‌రి సినిమాకి స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో క‌లిసి హ్యాట్రిక్ విజ‌యం అందుకుని ప్ర‌తిభ‌లో త‌న‌కు సాటిరారెవ్వ‌రూ! అని నిరూపించుకోవాల‌న్న పంతం చూపిస్తున్నార‌ట‌. అందుకు త‌గ్గ‌ట్టే బాల‌య్య సినిమాని విజువ‌ల్ గ్రాండియారిటీతో చూపించే స్క్రిప్టుని బోయ‌పాటి ఎంచుకున్నార‌ని స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు స్క్రిప్టు డిమాండ్ మేర‌కు బోయ‌పాటి ఏకంగా రూ.70 కోట్లు బ‌డ్జెట్ పెట్టాల్సి ఉంటుంద‌ని అంచ‌నా చెప్పార‌ట‌. అయితే అంత బ‌డ్జెట్ అత‌డిని న‌మ్మి పెడ‌తారా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్. బాల‌య్య కెరీర్ లో ఇంత బ‌డ్జెట్ ఎప్పుడూ లేదు. ఒక‌వేళ పెట్టినా అంత రాబ‌ట్టే అవ‌కాశం ఉందా? అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది. `విన‌య విధేయ రామ‌` డిజాస్ట‌ర్ ఫ‌లితం, అలాగే `క‌థానాయ‌కుడు`సేమ్ రిజ‌ల్ట్ ద‌రిమిలా.. ఆ ప్ర‌భావం తాజా సినిమా బ‌డ్జెట్ల‌పై ప్ర‌భావం చూప‌డం ఖాయం అన్న‌మాటా వినిపిస్తోంది. చ‌ర‌ణ్ కోసం బోయ‌పాటి 100 కోట్లు పెట్టించార‌ని, దీంతో న‌ష్టాలు త‌ప్ప‌లేదని ట్రేడ్ లో టాక్ వినిపించింది. మ‌రోవైపు ఎన్టీఆర్ బ‌యోపిక్ కి భారీగా ఖ‌ర్చు చేస్తే రూ.20 కోట్లు మాత్ర‌మే వ‌సూల‌వ్వడాన్ని జీర్ణించుకోలేని స‌న్నివేశం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో బాల‌కృష్ణ – బోయ‌పాటి కాంబో ఎంత బ‌డ్జెట్ పెడుతున్నారు? అంటూ ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. ఇంకా బాల‌య్య వైపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. నిర్మాత‌లు బ‌డ్జెట్ సంగ‌తి తేల్చాల్సి ఉంటుందిట‌.


Related Posts