విక్ర‌మ్ వేద రీమేక్ లో బాల‌య్య‌, రాజ‌శేఖ‌ర్!

Last Updated on by

మాధ‌వ‌న్, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన త‌మిళ్ బ్లాక్ బ‌స్ట‌ర్ విక్ర‌మ్ వేద ని తెలుగు లో రీమేక్ చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ రీమేక్ లో న‌టించ‌డానికి ప‌లువురు యంగ్ హీరోలు ఆస‌క్తి చూపించారు. తాజాగా ఆ క‌థ‌లో న‌టించ‌డానికి న‌ట‌సింహ బాల‌కృష్ణ‌, రాజ‌శేఖ‌ర్ ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. మాధ‌వ‌న్ పాత్ర‌లో రాజేశేఖ‌ర్, విజ‌య్ సేతుప‌తి రోల్ లో బాల‌య్య న‌టిస్తే బాగుంటుంద‌నే ప్ర‌పోజ‌ల్ ఓ స్టార్ డైరెక్ట‌ర్ ఇరువురి వ‌ద్ద‌కు తీసుకెళ్లాడుట‌. ఆ ఇద్ద‌రూ సినిమా చూడ‌క‌పోయినా పాత్ర‌లు న‌చ్చ‌డంతో ఆస‌క్తి చూపుత‌న్నారుట‌. అయితే ఇదింకా చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంది.

మ‌రీ ప్ర‌య‌త్నానికి పూనుకున్న ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రు? నిర్మాత ఎవ‌రు? అన్న‌ది అతి త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం బాల‌య్య బోయ‌పాటి సినిమాలో న‌టించ‌డానికి రెడీ అవుతున్నారు. అటు ఏపీలో ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆ ప‌నుల్లోనూ బిజీగా ఉన్నారు. ఎన్నిక‌లు త‌ర్వాత చిత్రాన్ని సెట్స్ కు తీసుకెళ్ల‌నున్నారు. రాజ‌శేఖ‌ర్ `క‌ల్కీ` సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో త‌ల‌మున‌కై ఉన్నారు. త్వ‌ర‌లోనే చిత్రం విడుద‌ల కానుంది.

User Comments