బాల‌య్య‌కు పటాసే!

Last Updated on by

బాల‌య్య‌తో అబ్బాయ్ క‌ళ్యాణ్ రామ్ ద‌ర్శ‌కుడి డీల్ ఏంటి? మ‌రో ప‌టాసేనా? ప‌్ర‌స్తుతం వేడి పెంచుతున్న టాపిక్ ఇది. వాస్త‌వానికి అనీల్ రావిపూడి వెంకీ-వ‌రుణ్‌తేజ్‌ల‌తో `ఎఫ్ 2` చేయ‌క‌ముందే బాల‌య్య‌కు క‌థ చెప్పాడు. కానీ అది వెంట‌నే టేకాఫ్ అవ్వ‌లేదు. ఆ క్ర‌మంలోనే `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` చిత్రంతో బాల‌య్య బిజీ అయిపోయాడు. ఆ త‌ర్వాత బాల‌య్య‌తో పూరి లైన్‌లోకొచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇన్నాళ్టికి మ‌రోసారి యువ‌ద‌ర్శ‌కుడు అనీల్‌ రావిపూడి మ‌రోసారి బాల‌య్య‌తో మంత‌నాలు సాగిస్తున్నాడ‌ని తెలిసింది.

ఎఫ్ 2 .. ఫ‌న్ .. ఫ్ర‌స్టేష‌న్ అంటూ వెంకీ, వ‌రుణ్‌తేజ్‌ల‌తో మ‌రో కామెడీ ఎమోష‌న‌ల్ డ్రామాని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా హిట్టు కొడితే ఇక రావిపూడికి కెరీర్ ప‌రంగా గ్యాప్ అన్న‌దే ఉండ‌దు. బాల‌య్య బాబు ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని పూర్తి చేసుకుని త‌దుప‌రి అనీల్ రావిపూడికి ఓకే చెప్పే అవ‌కాశం ఉంద‌న్న మాటా వినిపిస్తోంది. మ‌రోవైపు వినాయ‌క్‌, బోయ‌పాటి లాంటి స్టార్ డైరెక్ట‌ర్లు న‌ట‌సింహా క్యూలో ఉన్నా అనీల్ రావిపూడి వినిపించే క‌థ నెగ్గుకొస్తే ప్రాజెక్టు ఓకే అయిన‌ట్టేనని చెబుతున్నారు. ఇక బాల‌య్య – అనీల్ రావిపూడి కాంబో మూవీని నిర్మించేందుకు ఇదివ‌ర‌కూ దిల్‌రాజు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికీ ఆయ‌నే క్యూలో ఉన్నారా? అన్న‌ది తేలాల్సి ఉందింకా. అలానే బాల‌య్య‌బాబు మునుముందు ఎన్‌బికి ఫిలింస్ ప‌తాకంపై సొంతంగా సినిమాలు నిర్మించాల‌నుకుంటున్నారు కాబ‌ట్టి దిల్‌రాజుకు ఛాన్సుంటుందా .. లేదా? అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేం. కాస్త వేచి చూడాల్సిందే.

User Comments